Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్! | Bigg Boss Kannada 10: Sangeetha Sringeri And Drone Prathap Eye Injury - Sakshi
Sakshi News home page

Bigg Boss 10: షోలో అనుకోని ప్రమాదం.. ఆ బ్యూటీ కళ్లు చివరకు అలా!

Published Wed, Dec 13 2023 6:58 PM | Last Updated on Fri, Dec 15 2023 3:54 PM

Bigg Boss 10 Kannada Sangeetha Sringeri And Drone Prathap Eye Injury - Sakshi

బిగ్‌బాస్ షోలో ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న తెలుగు సీజన్‌లోనూ శివాజీ చాలారోజుల క్రితం ఇలానే గాయపడ్డాడు. తాజాగా కన్నడ సీజన్‌లోనూ ఇంనతకంటే పెద్ద ప్రమాదం జరిగింది. నిర్వహకులు పెట్టిన ఓ పిచ్చి టాస్క్ వల్ల యంగ్ హీరోయిన్ చావు అంచుల దాకా వెళ్లొచ్చింది.

ఇంతకీ ఏమైంది?
ప్రస్తుతం తెలుగులో 7వ సీజన్ కాగా కన్నడలోనూ 10వ సీజన్ ప్రసారమవుతోంది. గతవారం ఓ టాస్క్ సందర్భంగా.. సర్ఫ్ కలిపిన నీళ్లని కంటెస్టెంట్స్‌పై ముఖంపై కొట్టారు. మిగతా వాళ్లు తట్టుకోగలిగారు. కానీ సంగీత శృంగేరి, డ్రోన్ ప్రతాప్ కళ్లకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీళ్లని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. తాజా వీకెండ్ ఎపిసోడ్‌లో భాగంగా సంగీత, ప్రతాప్.. నల్ల కళ్లజోడు ధరించి రీఎంట్రీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!)

చావు అంచుల దాకా
'చార్లి 777' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత.. బిగ్‌బాస్ షోతో మరింత పేరు తెచ్చుకోవాలని అనుకుంది. ఇప్పుడు అనుకోని విధంగా ప్రమాదం జరగడంతో బాగా బెదిరిపోయింది. ఇ‍ప్పుడు ఎలా ఉంది? అని హోస్ట్ కిచ్చా సుదీప్ అడగ్గా.. 'టాస్క్ అవుతున్నప్పుడు చాలా నొప్పిగా అనిపించింది. సూదులతో కంట్లో గుచ్చుతున్నట్లు చాలా పెయిన్ వచ్చింది. ఇక చికిత్స జరుగుతున్నప్పుడైతే చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫీలింగ్ వచ్చింది' అని సంగీత తన బాధంతా చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతానికైతే సంగీత-ప్రతాప్ ఇద్దరూ కూడా షోలో కాస్త చలాకీగానే పాల్గొంటున్నారు. బహుశా కొన్నిరోజులు మెడిసన్ తీసుకుని, జాగ్రత్తగా ఉంటే సెట్ అయిపోతారనిపిస్తోంది. ఏమైనా సరే బిగ్‌బాస్ కనీస జాగ్రత్త తీసుకోకుండా పెట్టిన ఓ పిచ్చి టాస్క్ వల్ల ఇద్దరు కంటెస్టెంట్స్ ప్రాణాల మీదకు వచ్చింది.

(ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement