బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్‌ ఫోన్స్‌! | Bigg Boss 17 Hindi: Mobile Phones for Contestants | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ షాకింగ్‌ నిర్ణయం.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్‌ ఫోన్స్‌!

Published Sat, Oct 14 2023 2:45 PM | Last Updated on Mon, Oct 16 2023 9:38 AM

Bigg Boss 17 Hindi: Mobile Phones for Contestants - Sakshi

బిగ్‌బాస్‌ షో అంటేనే బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకోవడం! అయినవాళ్లను అందరినీ వదిలేసి, మొబైల్‌ ఫోన్‌కు గుడ్‌బై చెప్పేసి వంద రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు నిత్యపోరాటం చేస్తూ ఉండాలి. అయితే వినూత్నంగా, విచిత్రంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో మొబైల్‌ ఫోన్లు అనుమతించనున్నారట! ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారేమో! ఇది మన తెలుగు బిగ్‌బాస్‌ 7లో అనుకునేరు, కాదు.. హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో జరగబోతోంది.

ఇక్కడ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు మొబైల్‌ ఫోన్లు ఇస్తారట. కానీ అంత ఈజీగా కాదు. బిగ్‌బాస్‌ ఇచ్చే ప్రత్యేకమైన టాస్కులు గెలిచినవారికి కాసేపు ఫోన్‌ చూసుకునే అవకాశం కల్పిస్తారట! ఈ మేరకు ఓ వార్త వైరల్‌ అవుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఫోన్‌ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. అలాంటిది కంటెస్టెంట్ల చేతికి ఫోన్‌ ఇస్తే ఇంకేమైనా ఉందా? వారికి అన్ని విషయాలూ తెలిసిపోవూ అంటున్నారు నెటిజన్లు.

అసలు వారికి ఫోన్‌ ఎలా ఇస్తారు? ఎంతసేపు ఇస్తారు? ఇది నిజమేనా? అసలేం జరగబోతుంది? అనేది తెలియాలంటే షో ప్రారంభమయ్యేవరకు ఆగాల్సిందే! ఇంతకీ హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌ ఈ ఆదివారమే(అక్టోబర్‌ 15) ప్రారంభం కానుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

చదవండి:  విడాకుల ఆలోచన విరమించుకున్న ధనుష్‌, ఐశ్వర్య? మళ్లీ కలుస్తారా?

సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement