బిగ్‌బాస్ ఆట రంజుగా సాగుతుందనుకునేలోపే మళ్లీ చప్పబడింది. అటుపక్క హౌస్‌లో ఉన్న గ్లామర్ బ్యూటీలను వరుసగా పంపించేయడంతో కలర్‌ఫుల్‌గా కూడా కనిపించడం లేదు. నలుగురు అమ్మాయిల ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. ప్రతి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నట్లే ఈ సీజన్‌లోనూ ఉండబోతోంది. కానీ ఈసారి ఎవరూ ఊహించని రేంజ్‌లో జరగబోతోంది. ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించనున్నారు.
బిగ్‌బాస్ మినీ లాంచ్
ఈ విషయాన్నే వెల్లడిస్తూ తాజాగా స్పెషల్ ప్రోమో రిలీజైంది. 'ఈ సీజన్‌లో ఎప్పుడూ, ఎక్కడా జరగనటువంటి విషయాలు జరగబోతున్నాయి. ఈ సీజన్ ఉల్టా పుల్టా.. గుర్తుంచుకోండి' అని నాగ్ అసలు విషయం బయటపెట్టాడు. బిగ్‌బాస్ 2.0 మినీ లాంచ్ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుందని పేర్కొన్నాడు. దీంతో అభిమానులు తెగ ఎగ్జయిట్ అవుతున్నారు. బిగ్‌బాస్ గేమ్స్ సరిగా ఆడిస్తున్నా హౌస్‌లో ఉన్నవాళ్లు మాత్రం దాన్ని చెడగొడుతున్నారని, ఈ కొత్త కంటెస్టెంట్ల రాకతో అయినా షోలో మజా వస్తుందేమో చూడాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రోమోలో కొందరు నెటిజన్లు కొన్ని తప్పులను ఎత్తి చూపుతున్నారు.
హౌస్‌లోకి వెళ్లేది వాళ్లే!
'కొందరు కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తున్నట్లుగా అక్కడక్కడా క్లిప్పింగ్‌లు వదిలారు. కానీ అది గత సీజన్‌లో కంటెస్టెంట్లు చేసిన డ్యాన్స్.. ప్రోమో ఎడిట్ చేయడం కూడా రాదా?' అని విమర్శిస్తున్నారు. వీడియోలో హమీదా, సెట్ శ్వేతలు ఉన్నారని, ఈ ప్రోమోలో వాళ్లెందుకు వచ్చారని, ఇది మరీ దారుణమని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం హౌస్‌లోకి వెళ్లేది అంబటి అర్జున్, పూజా మూర్తి, భోలె షావళి, నయని పావని, అంజలి పవన్ అని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అంజలి చివరి నిమిషంలో పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడట!
చదవండి: రతిక బర్రె పిల్ల.. రాత్రంతా నిద్రపట్టలేదన్న ప్రశాంత్.. బ్యూటీ రియాక్షన్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment