నా దిల్‌ నీకిచ్చేస్తానన్న రతిక.. ఎగిరి గంతేసిన పల్లవి ప్రశాంత్‌ | Bigg Boss Telugu 7: BB Introduced 5 Weeks Immunity Task - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: ఐదు వారాలు సేఫ్‌ జోన్‌.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన బిగ్‌బాస్‌

Sep 6 2023 11:53 AM | Updated on Sep 6 2023 4:19 PM

Bigg Boss Telugu 7: BB Introduced 5 Weeks Immunity - Sakshi

ఇక్కడ దిల్‌ ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరికిస్తావు? అని అడిగింది. దానికి ప్రశాంత్‌.. అబ్బో, పెద్ద క్వశ్చనే.. అన్నాడు. అంతలోనే నువ్వెవరికి ఇస్తావు.. చెప్పు? అని ఎదురుప్రశ్నిం

బిగ్‌బాస్‌ షో.. కొత్తవారితో పరిచయం.. మరికొందరు తెలిసిన ముఖాలతోనే సావాసం.. ఎంతైనా హౌస్‌లో అడ్జస్ట్‌ అవడానికి కాస్త సమయం పడుతుంది. అదేంటో కానీ ఈ సీజన్‌లో మాత్రం అప్పుడే కలిసిపోవడాలు, గ్యాంగ్‌లు, కొట్లాటలు, ప్రేమ కథలు షురూ అయ్యాయి. అమ్మాయిలను చూస్తే చాలు మెలికలు తిరిగిపోతున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌. రతిక కనిపిస్తే చాలు తెగ సిగ్గుపడిపోతున్నాడు.

తాజాగా బిగ్‌బాస్‌ ఓ ప్రోమో వదిలాడు. ఇందులో రతిక మాట్లాడుతూ.. ఇక్కడ దిల్‌ ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరికిస్తావు? అని అడిగింది. దానికి ప్రశాంత్‌.. అబ్బో, పెద్ద క్వశ్చనే.. అన్నాడు. అంతలోనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం మానేసి.. నువ్వెవరికి ఇస్తావు, చెప్పు? అని తిరిగి ప్రశ్నించాడు. అందుకు రతిక క్షణం ఆలోచించకుండా నీకే ఇస్తాననేసింది. ఊహించని సమాధానంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు ప్రశాంత్‌.

అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. శారీరకంగా, మానసికంగా తమను తాము ప్రేక్షకులకు నిరూపించుకున్న విజేతకు ఏకంగా 5 వారాల ఇమ్యూనిటీని పొందే అవకాశం లభిస్తుందన్నాడు. ఇందులో భాగంగా మొదట కుస్తీ పోటీ ఏర్పాటు చేశారు. ఒక పహిల్వాన్‌ను, ఒక మల్లయోధురాలిని హౌస్‌లోకి పంపించి వారితో గెలవమన్నారు. వారిని చూసే వణికిపోయారు హౌస్‌మేట్స్‌. మరి ఈ టాస్కులో ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!​

చదవండి: అడల్ట్‌ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement