నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా రాణిస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికీ ఆయనను తెలుగు చలనచిత్రసీమకు బాస్‌గా చెప్పుకుంటూ ఉంటారు. వయసు పైబడుతున్నా మాస్ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ 2024 కార్యక్రమంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. '1983లో ఖైదీ సినిమా నాకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. అలాగే బాలచందర్‌గారితో రుద్రవీణ సినిమా చేశాను. ఈ చిత్రానికి నాలుగైదు జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ ఈ చిత్రానికిగానూ నిర్మాతకు ఒక్కరూపాయి లాభం రాలేదు.
దానికోసం ఎదురుచూస్తున్నా
అలాంటి పరిస్థితులను నేను కోరుకోను. నిర్మాతలను కాపాడాలనుకుంటాను. ఎస్పీ బాలు.. 'ఎప్పుడూ యాక్షన్ సినిమాలు చేస్తావేంటి? దంగల్ లాంటి చిత్రాలు చేయొచ్చు కదా' అని అడిగేవారు. అలాంటివి చేయడమంటే నాకూ ఇష్టమే.. కానీ నిర్మాతలు నష్టపోతారు. అందుకే కమర్షియల్ సినిమాలే ఎంచుకుంటున్నానని సమాధానమిచ్చాను. ఇప్పుడు నేను మంచి కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఎలాంటి అంచనాలు లేవు. నాకు నచ్చితే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ నా సినిమాలు చూస్తూ పెరిగారు. కాబట్టి నేను ఏ మూవీలో, ఏ స్టైల్‌లో నటిస్తే జనాలకు నచ్చుతుందో వారికి బాగా తెలుసు.
వాళ్లిప్పుడు లేరు
వాళ్లు మాత్రమే నన్ను కరెక్ట్‌గా చూపించగలరు. కొంతకాలం క్రితం రజనీకాంత్ ఓ మాట చెప్పాడు. మనం పని చేయాలనుకున్న లెజెండరీ డైరెక్టర్స్ ఇప్పుడు లేరు. ఇప్పుడంతా కొత్త దర్శకులే.. మన అభిమానులే డైరెక్టర్స్ అయితే వారిపై ఆధారపడటం మంచిది. మనల్ని ఎలా ప్రజెంట్ చేయాలన్న విషయం వారికే బాగా తెలుసు అని చెప్పాడు. ఇదే నిజం. నా అభిమాని బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇకపోతే జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్‌లో రామ్‌చరణ్, జాన్వీకపూర్ నటిస్తే చూడాలనుంది' అని చిరంజీవి తెలిపాడు.
చదవండి: అవసరం ఉందేమో.. దొంగకు సాయం చేయండన్న నటుడు.. నెట్టింట ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment