చిరంజీవితో హిట్‌ సినిమా.. ఉత్తమనటిగా అవార్డ్‌.. ఎవరో గుర్తుపట్టారా? | Chiranjeevi Heroine Singing Video Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Star Heroine: చిరంజీవితో సూపర్‌ హిట్‌ మూవీ.. ఈ స్టార్ హీరోయిన్‌ను ఎవరో తెలుసా?

Published Sun, Jul 21 2024 1:16 PM | Last Updated on Sun, Jul 21 2024 1:37 PM

Chiranjeevi Heroine Singing Video Goes Viral In Social Media

1980లలో హీరో, మేరీ జంగ్, దామినిలాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి భర్త, బిడ్డలతో అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఒక డ్యాన్స్‌ స్కూల్‌ ప్రారంభించి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పించేది. అయితే ఆమె కేవలం డ్యాన్సర్‌ మాత్రమే కాదండోయ్.. మంచి సింగర్ కూడా. తాజాగా ఆమె పాట పాడుతున్న ఓ వీడియో నెట్టింట తెగవైరవుతోంది. ఇది చూసిన నెటిజన్స్‌ అభిమాన నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా.. మీనాక్షి శేషాద్రి తెలుగు చిరంజీవి సరసన నటించింది. ఆపద్భాంధవుడు మూవీలో మెగాస్టార్‌తో నటించి మెప్పించింది.  ఈ సినిమాకు గానూ ఉత్తమనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. అంతకుముందు తెలుగులో మొదట జీవన పోరాటం సినిమాలో ప్రత్యేకపాత్రలో కనిపించింది. ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే చిత్రంలోనూ నటించింది. అయితే 1995లో మీనాక్షి శేషాద్రి.. హరీశ్‌ మైసూర్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement