![Dear Movie OTT Release Date](/styles/webp/s3/filefield_paths/dear-movie-ott.jpg.webp?itok=vqQmq9tW)
మరో డబ్బింగ్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మొన్నే రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా రెండు వారాలు తిరగకుండానే అందుబాటులోకి రానుంది. ఇదే ఇక్కడ షాకింగ్‌గా అనిపిస్తుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చూసిన ప్రేక్షకులు.. ఇంత మాత్రం దానికి థియేటర్లలో రిలీజ్ ఎందుకు చేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఇదే మూవీ? ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందనేది చూద్దాం.
తమిళంలో గతేడాది రిలీజైన సినిమా 'గుడ్ నైట్'. గురక వల్ల కొత్తగా పెళ్లయిన జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో హిట్ అయింది. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మరో తమిళ సినిమా 'డియర్'.
ఏప్రిల్ 11న 'డియర్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. దాదాపుగా 'గుడ్ నైట్' కథతోనే తీశారు. దానికి తోడు కనీసం ఎంటర్‌టైన్ చేసే సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దీంతో సినిమా ఫట్ అయింది. వారం తిరక్కుండానే థియేటర్ల నుంచి మాయమైంది. మరోవైపు ఏప్రిల్ 28 అంటే ఈ ఆదివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అని ప్రకటించేశారు. దీంతో మరీ 17 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురావడం ఏంట్రా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
'డియర్' కథ విషయానికొస్తే.. న్యూస్ రీడర్ అవ్వాలనుకునే అర్జున్ (జీవీ ప్రకాశ్).. చిన్న శబ్దాలకు కూడా నిద్రలో నుంచి లేచిపోయే సమస్యతో బాధపడుతుంటాడు. మరోవైపు గురక సమస్యతో బాధపడుతూ ఉంటుంది దీపిక (ఐశ్వర్యా రాజేశ్). ఒకరి సమస్యలు మరొకరికి తెలియకుండా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమైంది అనేదే కథ.
![](/sites/default/files/inline-images/dear-ott-release-date.jpg)
Comments
Please login to add a commentAdd a comment