Kamal Haasan Vikram Teaser Out Now: విలక్షణ నటుడు కమల్‌హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం(నవంబర్7)న కమల్ హాసన్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం. విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ పేరిట మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. పక్కా యాక్షన్ సీక్వెన్స్‌తో కమల్ అదరగొట్టారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
ఖైది, మాస్టర్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించిన లోకేశ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. అంతేకాకుండా దాదాపు మూడేళ్ల అనంతరం కమల్ హాసన్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ నెలకొంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటుమళయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment