బిగ్‌ బాస్‌ నుంచి బయటకు రానున్న గంగవ్వ | Gangavva Exit From Bigg Boss Telugu Season 8 For This Reason? Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ నుంచి బయటకు రానున్న గంగవ్వ

Published Thu, Oct 24 2024 8:22 AM | Last Updated on Thu, Oct 24 2024 10:36 AM

Gangavva Exit From Bigg Boss Telugu Season 8

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 నుంచి మధ్యలోనే గంగవ్వ బయటకు రానుందని తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా వాలంటీర్‌గానే షో నుంచి ఆమె బయటకు రానున్నారని సమాచారం. వైల్డ్ కార్డ్‌తో   బిగ్‌బాస్‌లోకి వెళ్లిన ఆమె కొద్దిరోజులకే బయటకు వస్తున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ వారంలో విష్ణుప్రియ,ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, పావని, మెహబూబ్ నామినేషన్‌ లిస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ వారం నామినేషన్‌ లిస్ట్‌లో గంగవ్వ లేకున్నా బిగ్‌బాస్‌ నుంచి ఎగ్జిట్‌ అవుతున్నారని టాక్‌ నడుస్తోంది. యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన గంగవ్వ, యూట్యూబర్‌ రాజు గతంలో వన్యప్రాణుల రక్షణ చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ తాజాగా కేసు నమోదు అయింది. దీంతో విచారణ ఎదుర్కొనేందుకు ఆమె బిగ్‌బాస్‌ నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతుంది.

2022లో గంగవ్వ, రాజు కలిసి ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్‌లో గంగవ్వ చిలుక పంచాంగం అనే వీడియో చేశారు. అందులో గంగవ్వ, రాజు జ్యోతిష్కులుగా నటిస్తూ చిలుకను ఉపయోగించారు. ఇలా వినోదం కోసం చిలుకను పంజరంలో బంధించడం చట్ట ప్రకారం నేరం కావడంతో వారిపై కేసు నమోదు చేశారు. గంగవ్వ ఆరోగ్యంపై కూడా సోషల్‌మీడియాలో రూమర్స్‌ వచ్చాయి. దీంతో   ‘మై విలేజ్ షో’ అనిల్‌ తాజాగా ఒక పోస్ట్‌ పెట్టారు. అవ్వ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అంటూ పేర్కొన్నాడు. అయితే, కేసు విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement