Itlu Amma: అమ్మకు ప్రేమకు అవార్డుల వెల్లువ! | Itlu Amma Movie Got Huge Response | Sakshi
Sakshi News home page

‘ఇట్లు అమ్మ’కు అవార్డుల వెల్లువ!

Published Sat, Dec 11 2021 5:07 PM | Last Updated on Sat, Dec 11 2021 5:08 PM

Itlu Amma Movie Got Huge Response - Sakshi

‘అంకురం’సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు సీ ఉమా మహేశ్వరరావు తాజాగా తెరకెక్కించిన గొప్ప సందేశాత్మక చిత్రం ‘ఇట్లు అమ్మ’. సుప్రసిద్ధ నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డా: బొమ్మకు మురళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల సోని ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రానికి భారీ స్పందన లభించింది. అంతేకాదు ఇప్పటి వరకు 47 అవార్డులను దక్కించుకొని రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మూవీ యూనిట్‌ కృతజ్ఞతలు చెప్పింది. 

చిత్ర నిర్మాత-బొమ్మకు క్రియేషన్స్ అధినేత డా: బొమ్మకు మురళి మాట్లాడుతూ.. సోని లివ్ లో ప్రసారమవుతున్న "ఇట్లు అమ్మ" చిత్రాన్ని ఓటిటి ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికి 47 అవార్డులు వరించాయి. మరిన్ని అవార్డులు  వస్తాయనే నమ్మకముంది. ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా మా అంచనాలను మించి వస్తున్నాయి. ఈ చిత్ర  నటీనటులు-సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు’అన్నారు.

‘ఇట్లు అమ్మ’ కథేంటంటే?
అనూహ్య పరిస్థితుల్లో బిడ్డను కోల్పోతుంది సరస్వతి(రేవతి). ఏ పాపమూ ఎరుగని అసలు చీమకు కూడా హానీ తలపెట్టని తన బిడ్డ అర్థాంతరంగా ఎందుకు మాయమైపోయాడో తెలియక తల్లడిల్లిపోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారనే ప్రశ్నలు ఆ ‘పిచ్చి తల్లి’ని నిద్ర పోనివ్వవు. అందుకే ఎలాగైనా తన కొడుకును పొట్టనపెట్టుకున్న వారి గురించి తెలుసు కోవాలనుకుని రోడ్డు మీదికి వస్తుంది. ఈ సత్యశోధనలో తల్లిగా ఆమెకెదురైన అనుభవాలు ఏంటి? ఆ తల్లి హంతకుడిని కనుక్కోగలిగిందా, తన కొడుకుతో పాటు, నేరస్తుడికి పట్టిన దురవస్థకు కారణాలను అన్వేషించే క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు తదితర విషయాలు తెలియాలంటే.. ‘ఇట్లు అమ్మ’మూవీ చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement