హీరోయిన్ జాన్వీ కపూర్.. హీరోయిన్ కాకముందు నుంచే మనలో చాలామందికి తెలుసు. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా చిన్నప్పటి నుంచే ట్రెండింగ్ లో ఉండేది. తల్లి వారసత్వంగా సినిమాల్లోకి ఎంట‍్రీ ఇచ్చిన ఈమె.. నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. గ్లామర్ విషయంలో ఎప‍్పటికప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చినట్లు అనిపిస్తుంది.
కరోనా మన జీవితాల్లోకి రాకముందు వరకు ఏ సినిమా అయినా థియేటర్లలోకి వచ్చేది. నచ్చితే ప్రేక్షకులు చూసేవారు లేకపోయినా సరే కొందరు చూసేవాళ్లు. ఎప్పుడైతే ఓటీటీ కల్చర్ పెరిగిందో అప్పటినుంచి మొత్తం పరిస్థితి మారిపోయింది. థియేటర్స్ కి వచ్చే ఆడియెన్స్ గతంతో పోలిస్తే తగ్గారు. స్టార్ హీరోహీరోయిన్లు నటించిన కొన్ని మూవీస్ డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి, ఇప్పటికీ అవుతూనే ఉన్నాయి.
(ఇదీ చదవండి: రావణుడు లుక్‌పై క‍్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!)
తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి అలా లేదు. చాలామంది ప్రముఖ హీరోలు, హీరోయిన్ల సినిమాలు ప్రముఖ ఓటీటీల్లో నేరుగా విడుదలైపోతున్నాయి. మిగతా వాళ్ల సంగతేమో గానీ జాన్వీ కపూర్ ని మాత్రం ఓటీటీ స్టార్ అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆరు చిత్రాలు చేస్తే.. అందులో మూడు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి.
జాన్వీ చేసిన వాటిలో 'ఘోస్ట్ స్టోరీస్', 'గుంజన్ సక్సేనా' నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ కాగా, 'గుడ్ లక్ జెర్రీ' హాట్ స్టార్ లో వచ్చింది. ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి నటించిన 'బవాల్'.. జూలైలో నేరుగా అమెజాన్ ప్రైమ్ లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'దేవర' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న జాన్వీకి.. ఇలా డైరెక్ట్ ఓటీటీ రిలీజులు కొత్త కష్టాలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే మాత‍్రం భవిష్యత్తులో ఈమెకి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయోమో?
Badlega sabke dilon ka haal kyunki duniya bhar hone wala hai Bawaal 💥 Iss July... banega mahaul as #BawaalGoesGlobal
— prime video IN (@PrimeVideoIN) June 19, 2023
Produced by #SajidNadiadwala and directed by @niteshtiwari22, #BawaalOnPrime to premiere worldwide in over 200 countries and territories only on @PrimeVideoIN… pic.twitter.com/KrhqqMlDIs
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!)
Comments
Please login to add a commentAdd a comment