చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం పెద్ద విజయాన్నే సాధించింది. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు కామెడీ టీకా ఇచ్చిందీ చిత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ దుమ్ము లేపిన ఈ సినిమా.. ఓటీటీలోలో మాత్రం బోల్తా కొట్టింది.
మాకు నచ్చలేదు: నెటిజన్లు
ఓటీటీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘జాతిరత్నాలు’ చిత్రం ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు తెగ నవ్వుకున్నారు. కానీ అదే జనానికి ఓటీటికు వచ్చేసరికి నచ్చటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా చూశాక ఇందులో ఏముందని ఇంతగా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. చిత్రంలో 'కంటేంటే లేదు, ఓవర్ రేటెడ్ కామెడీ తప్పా' అని పెదవి విరుస్తున్నారు ఓటీటీ ప్రేక్షకులు.
అసలు ఈ స్థాయి హిట్ మూవీకి ఓటిటిలోనూ బ్రహ్మరథం దక్కుతుందని అనుకున్నారు అంతా. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యి సినిమాలో విషయమే లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని బట్టి ఓ విషయం స్పష్టమైంది. థియేటర్ కు ఓటిటి కు ప్రేక్షకుల టేస్ట్‌ల్లో చాలా తేడాలుంటాయి. జనం మధ్య చూసిన సినిమాకు ..ఒంటరిగా లేదా ఇద్దరో ముగ్గురో కూర్చుని సెల్ ఫోన్, ట్యాబ్‌లలో చూసే సినిమాకు.. ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్‌లో చాలా తేడా ఉంటుందని ‘జాతిరత్నాలు’ విషయంలో తెలిసొచ్చింది. అయితే, నటన పరంగా నవీన్ పొలిశెట్టి మరో విజయ్ దేవరకొండ కానున్నాడని ఓటీటీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించడం జాతి రత్నాలకు ఓ సానుకూల అంశం.
( చదవండి: ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని నా భార్య వార్నింగ్ ఇచ్చింది : నాగబాబు )
#JathiRatnalu is overrated movie. Audience blindly following the majority opinion without having any own taste. #colorphoto #Jathirathnalu #uppena are examples of overrated ones. #naveenpolishetty is just brilliant to watch. He can be the next #vijaydevarakonda pic.twitter.com/N62eq6jAKj
— srini - శ్రీని (@srinidurvasula) April 12, 2021
Comments
Please login to add a commentAdd a comment