Jr NTR Jokes of SS Rajamouli Does Not Make RRR Sequel, People Will Kill Him - Sakshi
Sakshi News home page

Jr NTR: అదే జరిగితే రాజమౌళిని చంపేస్తారు.. ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌పై స్పందించిన ఎన్టీఆర్‌

Published Fri, Apr 8 2022 3:07 PM | Last Updated on Fri, Apr 8 2022 3:42 PM

Jr NTR jokes If SS Rajamouli Does Not Make RRR Sequel, People Will Kill Him - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌.. బాక్సాఫీస్‌పై అత్యధిక కలెక్షన్లు కురిపించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చెర్రీ, తారక్‌ల నటనకు ప్రేక్షకలోకం ఫిదా అయ్యింది. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ వెయ్యి కోట్ల క్లబ్బులోకి చేరగా చిత్రయూనిట్‌ సక్సెస్‌ పార్టీ చేసుకుంది. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ ఎప్పుడన్న ప్రశ్న తరచూ ప్రేక్షకుల నుంచి వారికి ఎదురవుతూ ఉంది. తాజాగా దీనిపై తారక్‌ సరదాగా స్పందించాడు.

'చాలామంది ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ కావాలని అడుగుతున్నారు. మాక్కూడా సెకండ్‌ పార్ట్‌ తీస్తే బాగుంటుందని అనిపిస్తోంది. రాజమౌళి కనక సీక్వెల్‌ తీయకపోతే మీరందరూ ఆయన్ని చంపేసేలా ఉన్నారు. ఆయన కచ్చితంగా రెండో పార్ట్‌ తీస్తారని ఆశిద్దాం' అని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విషయానికి వస్తే ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించారు. ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ పార్టీ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

అజయ్‌ దేవ్‌గణ్‌ ముఖ్యపాత్రలో నటించాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ మూవీ మార్చి 25న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైంది. ఒక్క హిందీలోనే రూ.200 కోట్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టి కరోనా వైపరీత్యం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.

చదవండి: ఖరీదైన వాచ్‌ పెట్టుకున్న ఎన్టీఆర్‌, ధరెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ఆస్పత్రి బెడ్‌పై మలయాళ నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement