జపానీస్‌లో మాట్లాడి అదరగొట్టిన తారక్‌, ఫ్యాన్స్‌ ఫిదా.. వీడియో వైరల్‌ | Jr NTR Talks in Japanese While Promoting RRR Movie in Japan | Sakshi
Sakshi News home page

Jr NTR Japanese Speech: జపానీస్‌లో మాట్లాడి అదరగొట్టిన తారక్‌, ఫ్యాన్స్‌ ఫిదా.. వీడియో వైరల్‌

Published Sat, Oct 22 2022 3:24 PM | Last Updated on Sat, Oct 22 2022 3:38 PM

Jr NTR Talks in Japanese While Promoting RRR Movie in Japan - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాన్‌ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక వారికి ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. దీనికి ఇటీవల వారి జపాన్‌ పర్యటనే ఉదాహరణ. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ జపాన్‌ వ్యాప్తంగా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ జపాన్‌లో వాలిపోయింది. ఇటీవల భార్య ప్రణతి, కుమారులతో జపాన్‌ వెళ్లిన తారక్‌కు హోటల్లో అరుదైన స్వాగతం అందింది. మీకు పెద్ద ఫ్యాన్‌ ఆ హోట్‌ మహిళా సిబ్బంది తారక్‌ లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: డీఏవీ స్కూల్‌ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్‌ కమ్ముల

ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. మూవీ ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా జపాన్‌ ప్రేక్షకులతో ముచ్చటించాడు ఎన్టీఆర్‌. ఈ సందర్భంగా ఆయన జపాన్‌లో స్పీచ్‌ ఇచ్చి అందరిని ఆశ్యర్యపరిచాడు. అచ్చమైన జపనీస్‌ స్లాంగ్‌తో మాట్లాడి అందరిని ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతుంది. ఈ జపాన్‌ పర్యటనకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఆయన భార్య ఉపాసనతో వెళ్లాడు. అలాగే రాజమౌళి ఆయన తనయుడు కార్తికేయ, అతని భార్యతో వెళ్లారు. ప్రస్తుతం తారక్‌, చరణ్‌, కార్తీకేయలు తమ కుటుంబాలతో కలిసి జపాన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఫొటోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement