
Kamal Haasan: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసింది. అయితే దీనిపై సినీ వర్గాల నుంచి తీవ్ర వ్యతరేకత వ్యక్తమైంది. నటుడు కమలహాసన్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎంపీలతో కలిసి సినిమాటోగ్రఫీ సవరణ చట్టానికి వ్యతిరేకత తెలిపేందుకు కమల్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.