
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు కరణ్ జోహారే కారణమని గతంతో ఆరోపించిన విషయం తెలిసిందే. సుశాంత్ సినీ కెరీర్‌ను నాశనం చేశాడని, తద్వారా అతడి ఆత్మహత్యకు పరోక్షంగా కారణమయ్యాడని ఆమె మండిపడ్డారు. కాబట్టి ఆయన పద్మ శ్రీ పురస్కారానికి అనర్హుడని.. ఆ అవార్డును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కంగనా సోషల్ మీడియా వేదికగా కోరారు. (చదవండి: ‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’)
దీనిపై కంగనా ట్వీట్ చేస్తూ.. ‘కరణ్ జోహార్ పద్మశ్రీ అవార్టును తిరిగి తీసుకోవాలని నేను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అతను నన్ను బహిరంగంగా ఓ అంతర్జాతీయ వేదికపై పరిశ్రమను వదిలి వెళ్ళమని బెదిరించాడు. అంతేగాక యంగ్ హీరో సుశాంత్ కెరీర్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నాడు. ఉరి చిత్రం వివాదం సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మన భారత సైన్యాన్ని అవమానించే విధంగా యాంటినేషనల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’ అని కంగనా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
(చదవండి: ఆమిర్‌ఖాన్ తీరుపై కంగనా ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment