సంచలనాలకు చిరునామా నటి కంగనా రనౌత్. ఈమె నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వివాదానికి దారి తీస్తుందా? లేక కొందరు కావాలనే వివాదం చేస్తారా..? అంటే చెప్పడం కష్టమే. నటిగానే గానే కాదు వ్యక్తిగతంగాను ఈమె రూటే సెపరేటు. ఈ బాలీవుడ్ బ్యూటీ బహుభాషా నటినే కాదు బహుముఖ ప్రతిభావంతురాలు. నటిగా నిర్మాతగా దర్శకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జయపజయాలు ఈమెకు కొత్తేమీ కాదు.
ఏక్ నిరంజన్ చిత్రం ద్వారా ఎప్పుడో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కంగనా ఆ తర్వాత ధామ్ ధూమ్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ మధ్య జయలలిత బయోపిక్ లో టైటిల్ పాత్ర పోషించి నేర్పించిన ఈమె ప్రస్తుతం ఎమర్జెన్సీ పేరుతో స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో చంద్రముఖి– 2 చిత్రంలోని టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!
ఆమె సినిమా గురించి కాకుండా రాజకీయపరమైన విషయాల పైన తనదైనస్టైల్‌లో స్పందిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంటారు. అలా ఆ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ కంగన కార్యాలయాన్ని పడగొట్టింది. అయినప్పటికీ ఈమె రాజకీయాలు సినిమా ప్రజా సమస్యలు వంటి వాటిపై వెంటనే స్పందిస్తుంటారు.
కాగా ఇటీవల కంగనా రనౌత్ భేటీలో పేర్కొంటూ తాను రాజకీయ నాయకులను విమర్శించడం వల్ల, దేశ వ్యతిరేక శక్తుల చర్యలను ఖండించడం వల్ల రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు నష్టపోయానని పేర్కొన్నారు. 30కి పైగా వాణిజ్య సంస్థల ప్రకటనల్లో నటించడానికి ఒప్పందం చేసుకున్నానని అయితే అవన్నీ రాత్రికి రాత్రే రద్దయినట్లు పేర్కొన్నారు. అలా భారీగా నష్టపోయానని నటి కంగనా రనౌత్ చెప్పారు. చదవండి: తిండి లేక కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకున్నా: విలన్ గంగరాజు
Comments
Please login to add a commentAdd a comment