ఇంట్లో ప్రశాంతత లేదు: స్టార్‌ హీరోయిన్‌ | Never Try To Be At Home: Kangana Ranaut - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: ఇంట్లో ప్రశాంతత, ఆనందం లేదు.. 2023లో..

Published Mon, Jan 1 2024 10:16 AM | Last Updated on Mon, Jan 1 2024 10:53 AM

Kangana Ranaut: Never Try to Be at Home - Sakshi

ఏదో ఒక సంఘటనతో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్‌.. కంగనా రనౌత్‌. తరచూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉండే ఈ బ్యూటీ నటిగా మాత్రం అంకిత భావంతో పని చేస్తారు. కానీ 2023వ సంవత్సరం కంగనాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.  గతేడాది ఈమె నటించిన ఒక్క చిత్రం కూడా విజయాన్ని అందుకోలేదు. హిందీలో నటించిన తేజస్‌ గానీ, తమిళంలో నటించిన చంద్రముఖి– 2 చిత్రం గానీ పూర్తిగా నిరాశ పరిచాయి.

అన్నీ ఫెయిల్యూర్సే..
అంతకు ముందు భారీ అంచనాల మధ్య విడుదలైన తలైవి చిత్రం అపజయాన్నే మూట కట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ ఎమర్జెన్సీ చిత్రం పైనే! ఇందులో కంగనా రనౌత్‌ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించడం విశేషం. తాజాగా ఈ సంచలన నటి తన ఎక్స్‌ మీడియాలో ఇంట్లో లేనప్పుడే తాను ప్రశాంతంగా, సంతోషంగానూ ఉంటానని పేర్కొన్నారు. మనం ఈ శరీరానికి నిరంతరం సొంతదారులం కాదన్నారు. ఈ జీవితం కూడా చాలా చిన్నదని, ఆ విషయం తనకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోందనే వేదాంతాన్ని వ్యక్తం చేశారు.

ఎప్పుడూ ఇంట్లోనే ఉండొద్దు
ఎప్పుడూ ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించరాదన్నది అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని తాను 2023లోనే తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. తాను పలు మైలురాళ్లను దాటి తన కలల ఇంటిని, గెస్ట్‌ హౌస్‌, ఫామ్‌ హౌస్‌లను నిర్మించుకున్నానని, అయినప్పటికీ ఇంటిలో ఉన్నప్పుడు కలగని ప్రశాంతత, ఆనందం బయట ఉన్నప్పుడు కలుగుతుందన్న విషయాన్ని గ్రహించానని చెప్పారు.

చదవండి:  ‘సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement