
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'కంగువ'. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు.
(ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత)
ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సూర్య గెటప్ డిఫరెంట్‌గా ఉంది. త్రీడీ ఫార్మాట్‌లో తీస్తున్నారు. ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'కంగువ' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మధ్యే థాయ్‌ల్యాండ్ వెళ్లారు. అక్కడ దట్టమైన అడవుల్లో 20 నుంచి 25 రోజులు పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నారు.
'కంగువ' చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా తమిళ ఉగాదికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత సూర్య, సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నాడు. అలానే వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' పూర్తి చేస్తాడు.
(ఇదీ చదవండి: 'మామ మశ్చీంద్ర' సినిమా రివ్యూ)