Keerthy Suresh And Janhvi Kapoor Bump Into Each Other In Hyderabad - Sakshi
Sakshi News home page

వారసురాళ్ల కలయిక.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Published Fri, Nov 4 2022 7:26 AM | Last Updated on Fri, Nov 4 2022 10:50 AM

Keerthy Suresh and Janhvi Kapoor bump into each other in Hyderabad - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి. అలాంటి నటి వాసురాలు జాన్వీ కపూర్‌ కథానాయకిగా రంగప్రవేశం చేశారు. బాలీవుడ్‌లో యువ కథానాయక రాణిస్తున్న ఈమెను దక్షిణాదిలో పరిచయం చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ యువ నటికి కూడా దక్షిణాది భాషల్లో నటించాలన్న కోరిక ఉన్న అందుకు ఇంకా సమయం రావడం లేదు. ఇక కీర్తి సురేష్‌ కూడా సినీ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఈమె తల్లి మేనక పలు చిత్రాల్లో కథానాయక నటించారు. తండ్రి సురేష్‌ మలయాళంలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్నారు. కీర్తి సురేష్‌ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కథానాయికగా పేరుపొందారు. ఈమె ఇంతకుముందే బోనీకపూర్‌ నిర్మించిన హిందీలో చిత్రంలో నటించాల్సి ఉంది.

అయితే అనివార్య కారణాలు వల్ల ఆ చిత్రంలో చోటు దక్కలేదు. అయితే అప్పటి నుంచే ఈమెకు నటి జాన్వీకపూర్‌కు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కాగా ప్రస్తుతం జాన్వీకపూర్‌ నటించిన విలీ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఆమె తండ్రి బోనికపూర్‌ జీ.స్టూడియోస్‌ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది మలయాళంలో 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన హెలన్‌ చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రంలో నటి జాన్వీకపూర్‌ బిజీగా ఉన్నారు. ఆ ప్రచారంలో భాగంగా జాన్వీ కపూర్‌ను కీర్తి సురేష్‌ ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారో గానీ, ఆ ఫొటోలను కీర్తి సురేష్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement