Keerthy Suresh Sister Revathy Entry Into Industry As Director - Sakshi
Sakshi News home page

Keerthy Suresh : డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్‌ సోదరి

May 27 2023 1:33 PM | Updated on May 27 2023 2:37 PM

Keerthy Suresh Sister Revathi Entry Into Industry As Director - Sakshi

మహానటి కీర్తి సురేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే యూత్‌లో మాంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. మహానటి సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. రీసెంట్‌గా నానితో దసరా సినిమాలో నటించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం మెగాస్టార్ మూవీ భోళాశంకర్‌లో కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తిసురేష్‌ ఫ్యామిలీ నుంచి ఆమె సోదరి ఇండస్ట్రీకి పరిచయం కానుంది. కీర్తి అక్క రేవతి సురేష్‌ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇది ఫీచర్‌ ఫిల్మ్‌కి కాదు.. షార్ట్‌ ఫిల్మ్‌ కోసం కావడం విశేషం.

కీర్తి తల్లి మేనక నటి కాగా, ఆమె నాన్న సురేష్‌ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి కీర్తి అక్క రేవతి డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె తీస్తున్న ఆ షార్ట్​ ఫిల్మ్ పేరు ‘థ్యాంక్ యూ’. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను స్వయంగా షేర్‌చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement