Kushi Movie Musical Concert: Vijay Devarakonda And Samantha Live Performance Video - Sakshi
Sakshi News home page

Kushi: సామ్‌ను ఎత్తుకుని తిప్పుతూ రౌడీ హీరో డ్యాన్స్‌.. ఫ్యాన్స్‌ ఖుషీ! చూడటానికి రెండు కళ్లు చాలవు..

Published Wed, Aug 16 2023 1:16 PM | Last Updated on Wed, Aug 16 2023 1:49 PM

Kushi Musical Concert: Vijay Devarakonda, Samantha Live Performance - Sakshi

తెలుగు తెరపై ఇద్దరూ స్టార్సే.. ఒకరేమో కుర్రాళ్ల ఫేవరెట్‌ హీరోయిన్‌, మరొకరేమో అమ్మాయిల మనసు దోచే హీరో.. ఇద్దరూ జత కడితే ఎలా ఉంటుంది? అబ్బో.. ఫ్యాన్స్‌కైతే అది మాటలకందని ఆనందం. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్‌ సమంత ఖుషి సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. వీరి జోడీ ఎలా ఉంటుందో చూడాలని యూత్‌ తెగ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఖుషి పాటలతో హోరెత్తిన ప్రాంగణం
వీరందరికీ చిత్రయూనిట్‌ చిన్న బహుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లో ఖుషి మ్యూజిక్‌ కన్సర్ట్‌ ఏర్పాటు చేసింది. పాటలతో ఆ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే విజయ్‌, సామ్‌ కలిసి లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చారు. స్టేజీపై డ్యాన్స్‌ చేశారు. విజయ్‌ అయితే షర్ట్‌ తీసేసి మరీ రంగంలోకి దూకాడు. సామ్‌ను ఎత్తుకుంటూ, తనను తిప్పుతూ రచ్చ చేశాడు. వీరి పర్ఫామెన్స్‌కు ప్రేక్షకులు చప్పట్లు, విజిల్స్‌తో అభినందనలు తెలిపారు.

షర్ట్‌ విప్పడం దేనికి?
ఈ డ్యాన్స్‌ చూసిన కొందరు విజయ్‌,సామ్‌ అతి చేశారని విమర్శలు గుప్పిస్తుంటే అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. లైవ్‌లో డ్యాన్స్‌ చూసేందుకు రెండు కళ్లు చాలలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరి జోడీ చూడముచ్చటగా ఉందని, డ్యాన్స్‌ చేసేటప్పుడు ఆ ఎనర్జీ, స్మైల్‌కు ఫిదా అయ్యామని చెప్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం.. విజయ్‌ షర్ట్‌ విప్పడం అవసరమా? అని ట్రోల్‌ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వీరి డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: తమన్నా ఆస్తి ఎంతో తెలుసా? వంద కోట్ల పైచిలుకే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement