ఇంటిమేట్‌ సీన్‌.. అంత ఈజీ కాదు: మాళవిక మోహనన్‌ | Malavika Mohanan Interesting Comments On Yudhra Intimate Scene | Sakshi
Sakshi News home page

ముద్దు సీన్‌ చేయడం అంత ఈజీ కాదు: మాళవిక మోహనన్‌

Published Sat, Sep 14 2024 12:56 PM | Last Updated on Sat, Sep 14 2024 4:32 PM

Malavika Mohanan Interesting Comments On Yudhra Intimate Scene

ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించడం అంత ఈజీ కాదు అంటుంది కేరళ బ్యూటీ మాళవికా మోహనన్‌. ఆమె నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘యుధ్రా’. ఇందులో ఆమె హీరో సిద్ధాంత్‌ చతుర్వేదితో కలిసి పలు ఇంటిమేట్‌, కిస్‌ సీన్లలో నటించింది. ‘సాథియా’ అంటూ సాగే పాటలో బికినీలో మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ ఇంటిమేట్‌ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్‌ సీన్లలో నటించడం అంత సులభం కాదన్నారు.

(చదవండి: భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్)

‘ప్రతి సినిమాలోనూ ఇంటిమేట్‌ సీన్లను షూట్‌ చేసేటప్పుడు సెట్‌లో ఇంటిమేట్‌ కో-ఆర్డినేటర్‌ ఉంటారు. నటీనటులు ఇబ్బంది పడకుండా ఎలా యాక్ట్‌ చేయాలో వాళ్లు చెబుతుంటారు. అలా చేయడం మంచి పని. అయితే యుధ్రా సినిమాలో అలాంటి సీన్లు చిత్రీకరించే సయమంలో కో ఆర్డినేటర్‌ సెట్‌లో లేరు. 

(చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్‌)

‘సాథియా’ సాంగ్‌ చిత్రీకరణ మాకు పెద్ద సవాలుగా మారింది. అందులో పలు రొమాంటిక్‌ సీన్లు ఉన్నాయి. సముద్రం తీరంలో ఆ పాట చేయాలి. అక్కడ చలి ఎక్కువ. ఏం చేయాలో అర్థం కాలేదు. మొదట్లో సిద్దాంత్‌, నేను కంగారుపడ్డాం. కానీ చలిని తట్టుకోలేక ఏదో ఒకరకంగా ఆ సీన్లను పూర్తి చేయాలనుకున్నాం. డైరెక్టర్‌ ఎలా చెబితే అలా చేశాం. ఇంటిమేట్‌ సీన్స్‌ చేయడం చాలా కష్టం. నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలి’ అని మాళవిక చెప్పుకొచ్చింది. మామ్‌’ ఫేమ్‌ రవి ఉద్యవార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement