8 Heroines In Megastar Chiranjeevi Mulloka Veerudu Fantasy Film, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi: ఆరుగురు హీరోయిన్లతో ‘ముల్లోక వీరుడు’గా రానున్న మెగాస్టార్‌!

Published Wed, Jun 14 2023 11:29 AM | Last Updated on Wed, Jun 14 2023 12:11 PM

Megastar Chiranjeevi As Mulloka Veerudu In Fantasy Film - Sakshi

చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’ ఆగస్టులో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందట. ఈ చిత్రానికి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని భోగట్టా.

(చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం! )

అంతే కాదు.. ఈ చిత్రంలో ఆరుగురు కథానాయికలు ఉంటారని, ఊహాత్మక స్వర్గం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కథకు చిరంజీవి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement