
‘‘నటుడిగా ఇంకా చాలాపాత్రలు చేయాలి.. నటనపరంగా ఇంకా ఎదగడానికి కృషి చేస్తూనే ఉంటాను. ఇన్నేళ్ల కెరీర్‌లో జయాపజయాలు చూశాను. అన్నింటినుంచీ ఏదో ఒకటి నేర్చుకున్నాను. అయితే నటుడిగా సంతృప్తి దక్కలేదు. ఇంకా చాలా సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నేడు (నవంబర్ 23) ఈ హీరో బర్త్‌డే. నాగచైతన్య హీరో అయి పద్నాలుగేళ్లు అవుతోంది. ఇక ఈ పుట్టినరోజు స్పెషల్ ఏంటంటే.. ‘దూత్’ సిరీస్‌తో తొలిసారి వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆ విశేషాలు, ఇంకా ఇతర విశేషాలను నాగచైతన్య ఈ విధంగా పంచుకున్నారు.
► ముందుగా బర్త్‌డే స్పెషల్ గురించి..
బర్త్‌డే గ్రాండ్‌గా జరుపుకోవడం ఉండదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో స్పెండ్ చేద్దామనుకుంటున్నా. నేను చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ విడుదలవుతోంది. అలాగే చందు మొండేటి డైరెక్షన్‌లో చేసే సినిమాకి ‘తండేల్’ టైటిల్ ఫిక్స్ చేసి, లుక్ రిలీజ్ చేశాం. నా బర్త్‌డే స్పెషల్స్ ఇవే.
► ‘దూత’ సిరీస్ గురించి..
డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. అందుకే మంచి వెబ్ సిరీస్ చేయాలనుకున్నాను. నాకు విక్రమ్ కె. కుమార్ చేసిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘13 బి, 24’, కొంతవరకూ ఆ తరహాలో ఉన్న ‘మనం’ వంటివి చాలా ఇష్టం. ‘24’ సినిమా లాంటి కాన్సెప్ట్ అయితే సిరీస్ చేద్దామనుకున్నాను. విక్రమ్ ఆ తరహాలో ‘దూత’ లాంటి యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చారు. అయితే వెబ్ సిరీస్ అని చెప్పలేదు. కానీ ఈ కాన్సెప్ట్‌ని రెండున్నర గంటల్లో చెప్పలేం. అందుకే సిరీస్‌గా చేశాం. సినిమాకీ, సిరీస్‌కీ నటనపరంగా వ్యత్యాసం లేదు. కానీ టెక్నికల్‌గా నాకో కొత్త అనుభవం. ‘దూత’కి సీజన్ 2, సీజన్ 3 ఐడియాలు ఉన్నాయి.
► చందు మొండేటి డైరెక్షన్‌లో చేసే ‘తండేల్’ సినిమా కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు...
మా టీమ్ మొత్తానికి ఇది స్పెషల్‌ప్రాజెక్ట్. రెగ్యులర్ షూటింగ్‌ని డిసెంబర్‌లో ఆరంభిస్తాం. కానీ ఆరేడు నెలలుగా ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతున్నా. ఈ చిత్రంలో నేను మత్స్యకారుడిపాత్ర చేస్తున్నాను. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్ కాబట్టి అవగాహన కోసం శ్రీకాకుళంలోని ఓ గ్రామానికి వెళ్లాం. శ్రీకాకుళం
స్లాంగ్ నేర్చుకుంటున్నా. ఫిషర్‌మేన్‌గా కనిపించడం కోసం ఫిజికల్‌గా మేకోవర్ అయ్యాను. అలాగే ఫిషర్‌మేన్ బాడీ లాంగ్వేజ్ కోసం మూడు నెలలు కృషి చేశాను. ఎప్పుడెప్పుడుషూటింగ్‌కి వెళదామా అని వేచి చేస్తున్నా.
► ఇంతకుముందు ఏ సినిమాకీ ఇంత వర్కవుట్ చేయలేదు కదా..
‘తండేల్’ పెద్ద స్పాన్ ఉన్న కథ. అందుకే షూటింగ్ ఆరంభించక ముందే ఎక్కువ టైమ్ కేటాయించాను. చందుతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్‌గారు, ‘బన్నీ’ వాసుగారు ఈ కథను చాలా నమ్మారు. నా కెరీర్‌లో పెద్ద బడ్జెట్ మూవీ అవుతుంది. కథ కొంత భాగం ఇండియా, కొంతపాకిస్తాన్‌లో జరుగుతుంది.
► ఓ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని చందు మీ క్యారెక్టర్‌ని క్రియేట్ చేశారట...
అవును. నేనా వ్యక్తిని కలిసి, మాట్లాడాను. ఓ ఫిషర్‌మేన్ లైఫ్‌లో జరిగిన కొన్ని ఘటనలను సినిమాటిక్‌గా చూపించనున్నాం.
► అక్కినేని ఫ్యామిలీకి ప్రేమకథలు లక్కీ.. ‘తండేల్’ ప్రధానంగా ప్రేమకథా చిత్రం కదా..
అవును. ఈ చిత్రంలో అద్భుతమైన ప్రేమకథ ఉంది. ఈ మధ్యకాలంలో నేను చేసిన చిత్రాల్లో ప్రేమపార్ట్ అంతగా లేదు. ఆ విషయాన్ని ఫీలయ్యాను. అందుకే ఈసారి ప్యూర్ లవ్‌స్టోరీ చేద్దామనుకున్నాను. ‘తండేలా’ అలాంటి చిత్రమే.
ఇక ఈ మధ్య ఓ హీరోయిన్‌తో మిమ్మల్ని లింక్ అప్ చేసి వార్తలు వస్తున్నాయి.. ఏమంటారు?
రానివ్వండి... నోప్రాబ్లమ్ (నవ్వుతూ). ఇలాంటి వాటి గురించి ఏం చెప్పినా.. ఎంత చెప్పినా ఆగవు. ఇక పర్సనల్ స్పేస్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చెప్పాల్సినది జరిగితే నేనే చెబుతాను.
Comments
Please login to add a commentAdd a comment