యాక్టింగ్‌ ‘యాస్పిరెంట్‌’ నమితా దూబే | Namita Dubey Biography And Movie Details In Telugu | Sakshi
Sakshi News home page

Namita Dubey: యాక్టింగ్‌ ‘యాస్పిరెంట్‌’

Published Sun, Apr 10 2022 8:26 AM | Last Updated on Sun, Apr 10 2022 8:26 AM

Namita Dubey Biography And Movie Details In Telugu - Sakshi

టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు నమితా దూబే. ఆమె నటించిన బేపనా, బడే భయ్యాకీ దుల్హనియా  సీరియళ్లు చూసినవాళ్లు ఆమెను మరచిపోలేరు. అందుకే వెబ్‌స్క్రీన్‌ ఎంట్రీ నమితాను మరింత పాపులర్‌ చేసింది. ఆమె వివరాలు కొన్ని...
 

► పుట్టింది, పెరిగింది లక్నోలో. తల్లి ప్రియా దూబే.. గృహిణి. తండ్రి వినయ్‌ దూబే.. ఐఏఎస్‌ ఆఫీసర్‌. 

► ఇంటర్‌ వరకు లక్నోలోనే చదివి డిగ్రీ కోసం ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌లో చేరింది. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో బీఏ చేసింది. 

► డిగ్రీలో ఉన్నప్పుడు  ఓ అయిదు నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌లో నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. ఆ ఉత్సాహంలోనే నిర్ణయించుకుంది నటనారంగంలోనే స్థిరపడాలని. 

► అనుకున్నట్టుగానే కాలేజ్‌ గ్రాడ్యుయేషన్‌ అయిపోగానే మోడలింగ్‌ చేసింది. ఆ సమయంలోనే ‘యే హై ఆషికీ’ అనే సీరీయల్‌లో నటించే అవకాశాన్ని అందుకుంది. బడే భయ్యాకీ దుల్హనియాతో గుర్తింపు వచ్చింది. బెపనా, గుమ్‌రాహ్‌తో పాపులర్‌ అయింది.

► ఆమె నటనాకౌశలానికి సినిమా తెర కూడా స్వాగతం పలికింది.. మై తేరా హీరో, లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా వంటి చిత్రాలతో. రెండింటిలో పోషించింది చిన్న పాత్రలే అయినా ఘనమైన పేరే తెచ్చుకుంది. 

► ఆ పేరు, పాపులారిటీ ‘యాస్పిరెంట్స్‌ (Aspirants)’ అనే వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్రలో అభినయించే అవకాశాన్నిచ్చాయి. ఊహించినట్టుగానే టాప్‌ మోస్ట్‌ వెబ్‌ యాక్ట్రెసెస్‌ జాబితాలో ఆమెను చేర్చింది. 

► నమితాలో సేవా గుణమూ మెండే. ముంబైలోని వరల్డ్‌ వెల్ఫేర్‌ చిల్డ్రన్‌ ట్రస్ట్, సలామ్‌ బాలక్‌ ట్రస్ట్‌ కోసం పని చేస్తుంటుంది ఏ కొంచెం సమయం చిక్కినా. 

► పుస్తకాలు చదవడం, ప్రయాణాలు, డాన్స్‌ ఆమె అభిరుచులు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement