నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ పక్క నటిస్తూనే మరోవైపు భర్తతో కలిసి పలు చిత్రాల్ని నిర్మిస్తోంది. అలానే రౌడీ పిక్చర్స్ పతాకంపై ఇతర సంస్థలు నిర్మించిన చిత్రాలను విడుదల చేస్తోంది. అలా ఇటీవల ఈ సంస్థ విడుదల చేసిన సినిమా 'కూళంగల్'. ఇప్పుడు ఈ చిత్రం మరో అవార్డుని కైవసం చేసుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?)
గ్రామీణ ప్రజల జీవనాన్ని ఆవిష్కరించే విధంగా దర్శకుడు పీఎస్.వినోద్‌రాజ్.. ఈ సినిమా తీశారు. అంతా కొత్తవాళ్లు నటించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. పలు అవార్డులు కూడా గెలుచుకుంది. తాజాగా శనివారం సాయంత్రం చైన్నెలోని చైన్నె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సీఏఐబీ-2023 అవార్డుల కార్యక్రమంలో కూళంగల్ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
దీంతో పాటు నటుడు శశికుమార్ కథానాయకుడిగా నటించిన 'అయోతి' కూడా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. కూళంగల్, అయోతి చిత్రాలు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకోవడం తమిళ సినీ పరిశ్రమకే గౌరవం అని ఈ వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!)
Comments
Please login to add a commentAdd a comment