మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూసి తీరాల్సిందే. లేదంటే చాలా అంటే చాలా మిస్సవుతారు. పోస్టర్ చూడగానే ఇదేదో పిల్లల మూవీ అనుకుంటారేమో. మొత్తం చూసిన తర్వాత మీ చిన్నారుల్ని ఇంట్లో వదిలి వెళ్లాలంటే భయపడతారు. ఎందుకంటే అంతలా మిమ్మల్ని డిస్ట్రబ్ అయ్యేలా చేస్తుంది. ఓటీటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు! జస్ట్ రూ.45 లక్షల బడ్జెట్‌తో తీశారు. 2018లో రిలీజైన ఈ మూవీలో అంతలా ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉంది? ఓవరాల్ రివ్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: 2 వారాల్లోనే ఓటీటీలోకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
'పిహు' సినిమా విషయానికొస్తే.. పిహు (పిహు మైరా విశ్వకర్మ) రెండేళ్ల పాప. ఉదయం నిద్రలేచేసరికి తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని పడి ఉంటుంది. ఆమె నిద్రపోతోందేమో అని పిహు అనుకుంటుంది. చాలాసార్లు లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ పాప వల్ల కాదు. అలానే పిహు చిన్నపిల్ల కావడంతో బయటకు రాలేక ఇంట్లోనే చిక్కుకుపోతుంది. ఫ్రిడ్జ్, గ్యాస్, వాటర్ ఫిల్టర్, ఇస్తీ పెట్టె లాంటి వాటి గురించి తెలియకపోవడం వల్ల అన్నింటిని ఆన్ చేసి పెట్టేస్తుంది. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సిట్చ్యూయేషన్ నుంచి పిహు ప్రాణాలతో బయటపడిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.
సాధారణంగా చిన్నపిల్లల సినిమాలు చూడటానికి సరదాగా ఉంటాయి. 'పిహు' మాత్రం మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు వణికిపోయేలా చేస్తుంది. ఇందులో కొత్తగా ఏం ఉండదు. ఓ పాప, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టె, గ్యాస్ లాంటివి ఆన్ చేసేసి ఇవేంటి ఇంత డేంజర్ అనుకునేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలని ఇంట్లో వదిలి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పడాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది.
(ఇదీ చదవండి: శర్వానంద్ 'మనమే' సినిమా రివ్యూ)
ఈ మూవీ అంతా అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లోనే షూట్ చేశారు. కానీ చూస్తున్నంతసేపు ఏ మాత్రం బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా? పిహుకి ఏం కాదుగా అని మనం టెన్షన్ పడేలా చేస్తుంది. కేవలం గంటన్నరే ఉంటుంది. కానీ మూవీ పూర్తయిన తర్వాత మనల్ని పిహు పాత్ర వెంటాడుతుంది. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేసి పడేసింది. ఎలా ట్రైనింగ్ ఇచ్చారో, ఏం చేశారో గానీ మూవీ చూసిన తర్వాత మాత్రం పాప క్యూట్‌నెస్, యాక్టింగ్‌కి ఫిదా అయిపోతాం.
చాలామంది పిల్లలు ఇంట్లో కుదురుగా ఉండకుండా.. వస్తువులతో ఎలా పడితే అలా ఆడుకుంటూ ఉంటారు. కానీ అవి ఎంత ప్రమాదం అనేది పిల్లలకు కచ్చితంగా చెప్పాలి బాబోయ్ అని 'పిహు' చూసిన తర్వాత మీకు పక్కా అనిపిస్తుంది. ఇప్పటికే మీకు పిల్లలున్నా, త్వరలో పిల్లల్ని ప్లాన్ చేస్తున్నా.. నెట్‌ఫ్లిక్స్‌లో అర్జెంట్‌గా ఈ మూవీ చూడండి. హిందీలో అందుబాటులో ఉంది. వేరే భాష అని కంగారు పడాల్సిందేం లేదు. ఈ మువీలో డైలాగ్స్ కంటే సీన్స్ ఎక్కువ.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)
Comments
Please login to add a commentAdd a comment