ప్రభాస్ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. దేశవ్యాప్తంగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామనుకునే చాలామందికి ఇంకా టికెట్స్ దొరకట్లేదు. పోనీ తొలిరోజు ఏ షో అయినా పర్లేదు మూవీ చూద్దామనుకున్నా సరే టికెట్ దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి టైంలో బ్లాక్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాకపోతే ఈ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.
(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)
ఒకప్పుడు బ్లాక్ టికెట్స్ అంటే థియేటర్ల దగ్గర యాభై, వంద అని చెప్పి అమ్మేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. టికెట్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు పంపించమని చెప్తారు. తీరా తీరా పంపిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. మీరు వాళ్లని ఏం చేయలేరు.
మరోవైపు ఆన్‌లైన్ టికెట్‌ని ఎవరైనా మీకు అమ్మిన సరే కొన్నిసార్లు మీరు మోసపోవచ్చు. ఎందుకంటే బార్ కోడ్ ఉన్న టికెట్‌ని మీకు విక్రయించినట్లే, వేరొకరికి కూడా అమ్మే అవకాశముంది. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. లేదంటే అటు సినిమా చూడక ఇటు డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు అవుతారు. కాబట్టి సినిమా ఈ రోజు కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. కానీ టికెట్ కొనే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!)
Comments
Please login to add a commentAdd a comment