
మొన్నీమధ్యే అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ లాంటి టెక్ దిగ్గజాలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే వీళ్లందరూ వేసుకున్న డ్రస్సులు, ఆభరణాలు-వాటి ధరలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాయి. ఇప్పుడు అదే అంబానీ మరో ఈవెంట్ చేశారు. ఇందులో మిగతా వాళ్ల సంగతేమో గానీ ప్రియాంక చోప్రా.. అత్యంత ఖరీదైన నెక్లెస్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. ఎక్కడంటే?)
సౌత్ సినిమాలతో మొదలుపెట్టి హిందీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. పాప్ సింగర్ నిక్ జొనాస్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయింది. అప్పుడప్పుడు మన దేశంలో కనిపించే ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఒకటి రెండు ప్రాజెక్టులు చేస్తూ మళ్లీ ఇక్కడ బిజీ అవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అంబానీ ఇంట జరిగిన హోలీ ఈవెంట్ లో తళుక్కున మెరిసింది.
తేల గులాబీ రంగు డ్రస్సులో అందాల విందు చేసిన ప్రియాంక చోప్రా.. ఓ ఖరీదైన నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఆభరణం గురించి ఆరా తీయగా.. అత్యంత అరుదైన వజ్రాలు పొదిగిన బెవల్గారీ కంపెనీకి చెందినది అని తెలిసింది. అలానే దీని ధర ఏకంగా రూ.9.18 కోట్ల వరకు ఉందని టాక్. నెక్లెస్ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ రేటు చూసి నెటిజన్లకి మైండ్ బ్లాక్ అయిపోతోంది.
(ఇదీ చదవండి: ఎస్పీ చరణ్‌తో వివాదం.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!)
I need those pictures 🔥🔥#PriyankaChopra pic.twitter.com/rFeiCGt0db
— NP LEGΛCY 🇨🇴 | Loving MMCJ ❤🍼 (@np_legacy) March 16, 2024
Comments
Please login to add a commentAdd a comment