బస్ కండక్టర్ స్థాయి నుంచి కోలీవుడ్‌ను ఏలే సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు రజనీకాంత్. అయినప్పటికీ తన జీవితంలో పది శాతం సంతోషం కూడా మిగల్లేదని వ్యాఖ్యానించాడు. చెన్నైలో హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ త్రూ క్రియ యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
'నేను గొప్ప నటుడినని అందరూ అంటుంటారు. ఇది ప్రశంసో, విమర్శో అర్థం కావడం లేదు. రాఘవేంద్ర, బాబా.. ఈ రెండు సినిమాలు నాకు ఆత్మ సంతృప్తినిచ్చాయి. బాబా సినిమా చూశాక చాలామంది హిమాలయాలు వెళ్లామని చెప్పారు. నా అభిమానులు కొందరైతే సన్యాసులుగా మారిపోయారు. కానీ నేను మాత్రం నటుడిగా ఇక్కడే కొనసాగుతున్నాను. హిమాలయాల్లో కొన్ని అపూర్వమైన మూలికలు దొరుకుతాయి. అవి తింటే వారానికి సరిపడా శక్తి లభిస్తుంది.
ఆరోగ్యం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. అనారోగ్యానికి గురైతే మనకు కావాల్సిన వాళ్లు కూడా తట్టుకోలేరు. నేను నా జీవితంలో డబ్బు, పేరుప్రఖ్యాతలు అన్నీ చూశాను. సంతోషం, ప్రశాంతత మాత్రం పది శాతం కూడా దక్కలేదు. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండేవి కావు' అని చెప్పుకొచ్చాడు తలైవా. ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
చదవండి: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన డైరెక్టర్
నేను మారిపోయా, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా..
Comments
Please login to add a commentAdd a comment