Rajinikanth Photo Outside Famous Mayo Clinic USA Goes Viral - Sakshi
Sakshi News home page

Rajinikanth: సూపర్‌ స్టార్‌ యూఎస్‌ ఫోటోలు లీక్‌..లోకల్‌ ట్రైన్‌లో అలా..

Published Sun, Jun 27 2021 10:49 AM | Last Updated on Sun, Jun 27 2021 11:18 AM

Rajinikanth USA Photos Leaked - Sakshi

Rajinikanth: రజనీకాంత్‌ ఇటీవల అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల కోసమే ఆయన వెళ్లారనే వార్త ఉన్నప్పటికీ రజనీ ఆరోగ్యం విషయమై కొందరి అభిమానుల్లో కాస్త టెన్షన్‌ లేకపోలేదు. అయితే టెన్షన్‌ అక్కర్లేదు. సూపర్‌ స్టార్‌ సూపర్‌ జోష్‌లో ఉన్నారని రెండు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటి అమెరికాలోని ప్రముఖ ఆస్పత్రి నుంచి తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌తో కలిసి రజనీ నడుచుకుంటూ వస్తున్న ఫొటో.

మరోటి లోకల్‌ ట్రైన్‌లో గాగుల్స్‌ పెట్టుకుని, స్టయిల్‌గా ప్రయాణిస్తున్న ఫొటో. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. ఆరోగ్యం బాగాలేకపోతే తలైవా (నాయకుడు) లోకల్‌ ట్రైన్‌లో ఎందుకు ప్రయాణిస్తారు? ఆయన ఫుల్‌ జోష్‌గానే ఉన్నారని ఆనందపడుతున్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని వైద్య పరీక్షల కోసం రజనీ మరో రెండు వారాల పాటు అమెరికాలోనే ఉంటారని, జూలై 8కి ఇండియా చేరుకుంటారని సమాచారం. ఇక ఆయన నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబర్‌ 4న విడుదల కావాల్సి ఉంది. సినిమా షూటింగ్‌ కూడా దాదాపు పూర్తయిన నేపథ్యంలో అప్పటికి థియేటర్లు ఓపెన్‌ అయ్యుంటే అనుకున్న ప్రకారం విడుదలవుతుంది.

చదవండి:
సూర్య 40వ చిత్రంలో సామూహిక అత్యాచార ఘటన?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement