Ram Charan Fans Attack On Sunishith Who Abusive Talk About Upasana Konidela - Sakshi
Sakshi News home page

Ram Charan Fans: ఉపాసనపై కామెంట్స్.. చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!

Published Sat, May 13 2023 3:40 PM | Last Updated on Sat, May 13 2023 5:32 PM

Ram Charan Fans Attack On Person Who Abusive Talk About Upasana - Sakshi

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ జంటల్లో ఒకరు. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.  ఇటీవలే హైదరాబాద్‌లో సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్‌కు ఉన్న ఫ్యాన్స్  ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసిన పని.. ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.  ఇంతకీ ఏం జరిగిందంటే?

(ఇది చదవండి: ఉపాసన- చెర్రీ దంపతులు.. అడగకుండానే హింట్ ఇచ్చారుగా!)

ఇటీవల సునిశిత్ ఓ ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌పై కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అవీఆమెను కించ‌ప‌రిచేలా ఉండటంతో మెగా అభిమానుల‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో రామ్ చ‌ర‌ణ్ అభిమానులు అతని కామెంట్స్‌కు తగిన రీతిలో స్పందించారు. ఈ విషయం తెలుసుకున్న చెర్రీ ఫ్యాన్స్ అతనికి గట్టిగానే బుద్దిచెప్పారు. ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్‌ను అభిమానులు చితకబాదారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గతంలోనూ చాలా సార్లు టాలీవుడ్‌ సెలబ్రీటీల గురించి తప్పుగా మాట్లాడి ఇలాగే అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement