Ram Charan And His Upasana Moved To Chiranjeevi's House - Sakshi
Sakshi News home page

మళ్లీ అత్తమామల దగ్గరకు ఉపాసన

Published Fri, Jun 16 2023 1:11 PM | Last Updated on Fri, Jun 16 2023 1:51 PM

Ram Charan Upasana Shift To Chiranjeevi House - Sakshi

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్‌ కపుల్స్‌లో ఒకరు. ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్లకు మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. త్వరలోనే ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మెగా కుటుంబంలో ప్రాధాన్యత సంతరించుకుంది. వారి ఫ్యామిలీలో మరో తరం అడుగుపెడుతుంటడంతో అంతా ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు పుట్టిబోయే బిడ్డ గురించి ఉపాసన కీలక నిర్ణయం తీసుకుంది. 'రామ్‌చరణ్‌, నేనూ త్వరలోనే అత్తమామల దగ్గరకు షిఫ్ట్‌ అవుతున్నాం’ అని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

(ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్‌ గురించి కామెంట్‌ చేసిన కృతి సనన్ తండ్రి)

'నేను, చరణ్‌ ఈ స్థాయికి చేరుకున్నాం అంటే అది మా గ్రాండ్ పేరెంట్స్ పంచిన ప్రేమ వల్లే. అది నా బిడ్డకు కూడా దక్కాలి. అందుకే అత్తయ్య, మావయ్యతో కలసి ఉండాలని  నిర్ణయించుకున్నాం. వారి ప్రేమను నా బిడ్డకు దూరం చేయకూడదు. సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారు. కానీ, మేము దానికి పూర్తి భిన్నం. ప్రస్తుతం మేమిద్దరం అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నాం’ అని ఉపాసన నవ్వూతూ చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆమె నిర్ణయానికి ఫిదా అవుతున్నారు. 

(ఇదీ చదవండి: Adipurush: ఓం రౌత్, ప్రభాస్‌ను కలిపింది ఎవరు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement