
Ram Gopal Varma Shocking Comments Before Meeting With Perni Nani: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఈ రోజు అమరావతికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రితో వర్మ భేటీ ముగిసింది. అయితే మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందుకు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడికి తాను సినీ పెద్దల కామెంట్స్, లేఖలపై స్పందించేందుకు రాలేదంటూ కామెంట్స్ చేశాడు.
చదవండి: ఇది బాధ్యతారాహిత్యమంటూ డైరెక్టర్‌పై ట్రోల్స్, నెటిజన్లకు హరీశ్ శంకర్ ఘాటు రిప్లై
ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదని, నాగార్జున వ్యాఖ్యలపై కానీ, లేఖలు, ఇతరత్రా కామెంట్స్‌పై మాట్లాడేందుకు తాను రాలేదన్నాడు. కేవలం సినీ దర్శకుడిగానే మంత్రి పేర్ని నానిని కలుస్తున్నానని, సినిమా టికెట్ల ధరల అంశంపై తన అభిప్రాయం ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపాడు. ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు. కాగా నేడు(సోమవారం) ఉదయం వర్మ హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి కారులో అమరావతి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment