ఆ స్టార్‌ హీరోతో నటించాలనుంది: రష్మిక మందన్నా | Rashmika Mandanna Reaction On Acting With Dhanush | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ఆయన మంచి పర్ఫార్మర్‌.. తనతో నటించేందుకు ఎదురు చూస్తున్నా..

Published Sat, Jan 20 2024 12:07 PM | Last Updated on Sat, Jan 20 2024 12:50 PM

Rashmika Mandanna Reaction on Act With Dhanush - Sakshi

హీరో ధనుష్‌ మంచి పర్ఫార్మర్‌ అంటోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. ఈమె అల్లుఅర్జున్‌తో నటించిన పుష్పచిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఆ తరువాత బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఈ మధ్యే రణ్‌బీర్‌ కపూర్‌తో జతకట్టి యానిమల్‌ మూవీతో మంచి హిట్టును తన ఖాతాలో వేసుకుంది. తమిళంలో కార్తీ సరసన సుల్తాన్‌, విజయ్‌కు జంటగా వారిసు(వారసుడు) చిత్రాల్లో నటించి ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ధనుష్‌-నాగార్జున- శేఖర్‌కమ్ముల కాంబినేషన్‌
వరుసగా పాన్‌ఇండియా చిత్రాల్లో నటిస్తున్న రష్మిక మరోసారి కోలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ధనుష్‌ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా నటించనుంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజాకార్యక్రమాలతో ప్రారంభౖమైంది. ఈ మల్టీస్టారర్‌ మూవీకి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు.

ధనుష్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా
తాజాగా రష్మిక మాట్లాడుతూ.. ధనుష్‌ సరసన నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఆయన మంచి పర్ఫార్మర్‌ అని తెలిపింది. తన పక్కన నటించడం వల్ల పలు విషయాలను నేర్చుకోవచ్చంది. ధనుష్‌తో నటించడానికి నటించడానికి ఇది కూడా ఓ ముఖ్యకారణమని చెప్పుకొచ్చింది. తాను వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నానని, ధనుష్‌ సరసన నటించే ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రష్మిక మందన్న తెలిపింది.

చదవండి: జర్మనీలో మహేశ్‌ బాబు.. ఎందుకో తెలుసా?

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement