RRR Movie Bike: Interesting Facts About Jr NTR Velocette Bike Details Here - Sakshi
Sakshi News home page

Jr NTR Bike in RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తారక్‌ బైక్‌ కోసం అన్ని లక్షలు ఖర్చు చేశారట

Published Fri, Mar 25 2022 12:08 PM | Last Updated on Fri, Mar 25 2022 12:42 PM

RRR Movie Bike: Interesting Facts About Jr NTR Velocette Bike Details Here - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం​ శుక్రవారం(మార్చి25)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏ థియేటర్స్‌ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. సోషల్‌ మీడియాలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్‌ విశేషాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎన్టీఆర్‌ బైక్‌పై కూడా తెగ చర్చ నడుస్తుంది. అసలు ఆ బైక్‌ ఏం కంపెనీకి చెందింది? దాని ధరెంత అంటూ నెటిజన్లు సెర్చ్‌ చేస్తున్నారు. మరి ఆ బైక్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషాదం.. సినిమా చూస్తూ అభిమాని మృతి

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఉపయోగించిన బైక్‌ పేరు వెలోసెట్‌ మోటార్‌ బైక్‌. బ్రిటన్‌కు చెందిన ఈ కంపెనీ హెడ్‌ ఆఫీస్‌ బ‌ర్మింగ్ హామ్‌లో ఉంది. 1920 నుంచి 1950 వ‌ర‌కు అంత‌ర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఉండేది ఈ బైక్. అప్పట్లోనే 350 సీసీ, 500 సీసీ బైకుల‌ను త‌యారు చేసింది ఈ కంపెనీ.1971లో ఈ కంపెనీ బైకుల ఉత్ప‌త్తిని ఆపేసింది. ఆనాటి మోడల్ బైక్ కోసం రాజమౌళి చాలా ట్రై చేశారట.

చివరికి  ఎక్కడా లేకపోవడంతో, ఆనాటి బైకులు ఎలా ఉండేవో తెలుసుకుని ప్రత్యేకించి తయారు చేయించారట. ఇలా ఆ బైక్‌ను డిజైన్‌ చేయించడానికి సుమారు  20 లక్షల రూపాయల వరకూ ఖర్చు అయిందని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించగా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించారు. చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌పై సెలబ్రిటీల రివ్యూ: సినిమా అదిరిపోయిందంతే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement