Chiranjeevi Tweets About Sai Dharam Tej Discharged From Hospital After Bike Accident - Sakshi
Sakshi News home page

Sai Dhbaram Tej: ఇది సాయి తేజ్‌కు పునర్జన్మ: చిరంజీవి

Published Fri, Oct 15 2021 10:57 AM | Last Updated on Fri, Oct 15 2021 12:13 PM

Sai Dharam tej Discharged From Hospital After Bike Accident Chiranjeevi Tweets - Sakshi

(ఫైల్‌ ఫోటో)

Sai Dharam Tej Discharged From Hospital: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. మెగా మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా నేడు సాయి ధరమ్‌ తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సాయి తేజ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

చదవండి: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ట్విటర్‌ రివ్యూ

‘విజయ దశమి ప్రత్యేక రోజున సాయి ధరమ్‌ తేజ్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. సాయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ’ అంటూ రాసుకొచ్చారు. అనంతరరం తేజ్‌కు ఆయన బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కాగా గత నెల వినాయక చవితి సందర్భంగా సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా సాయి 35 రోజుల తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారు. నేడు విజయ దశమి, సాయి తేజ్‌ పుట్టిన రోజు రెండు ఒకే రోజు రావడం.. ఈ రోజే సాయి కోలుకుని ఇంటికి తిరిగి రావడంతో  మెగా ఇంట్లో సంతోషం మరింత రెట్టింపు అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement