Sai Pallavi Takes A Long Gap In Movie To Movie - Sakshi
Sakshi News home page

Sai Pallavi: గ్యాప్‌ రాలేదు.. తీసుకున్నా: సాయి పల్లవి

Published Mon, May 29 2023 6:56 AM | Last Updated on Mon, May 29 2023 9:37 AM

Sai Pallavi Takes a Gap in Movies - Sakshi

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన నటి సాయి పల్లవి. మొదట్లో నటన ఈమెకు అభిరుచి మాత్రమే! ఆ తరువాత అదే లైఫ్‌గా మారింది. అయితే ఎప్పటికైనా తాను డాక్టర్‌గా సేవ చేస్తానంటోంది సాయిపల్లవి. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఈమె మాత్రం రచ్చ గెలిచి ఆ తరువాతే ఇంట గెలవడం విశేషం. తమిళనాడుకు చెందిన ఈమె నటిగా ముందు గెలిచింది మాత్రం మాలీవుడ్‌లోనే. అనుకున్నది జరగకపోవడమే జీవితం అంటారు. అలానే సాయిపల్లవి జార్జియాలో వైద్య విద్యను అభ్యసించింది. ఈమెకు నాట్యంలో ఆసక్తి కలగడంతో తన తల్లి వద్దే సాంప్రదాయబద్దంగా నాట్యాన్ని నేర్చుకుంది.

అలా ఒక వేదికపై చేసిన నాట్య ప్రదర్శన సాయిపల్లవి జీవిత పయనాన్ని మార్చేసింది. మొదట్లో కస్తూరి మాన్‌, ధామ్‌ ధూమ్‌ అనే తమిళ చిత్రంలో చిన్న పాత్రల్లో మెరిసింది. నిజానికి హీరోయిన్‌ కావాలనే ఆలోచన గానీ, ఆశ గాని ఈమెకు లేవట. అయితే మలయాళ దర్శకుడు అల్ఫోన్స్‌ పుత్రన్‌ దర్శకత్వం వహించిన ప్రేమమ్‌ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా మలర్‌ అనే టీచర్‌ పాత్రలో నటించింది. 2015లో ఆ చిత్రం విడుదలైంది. ఆ ఒక్క చిత్రంతో నటనకు స్వస్తి చెప్పి వైద్య వృత్తిని చేపట్టాలని భావించింది.

కానీ ఆ చిత్రం విజయం సాధించడం, సాయిపల్లవి సహజమైన నటన అందరినీ ఆకట్టుకోవడంతో ఆమెకు తమిళం, తెలుగు వంటి ఇతర భాషల్లోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా నటనను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదు. తనకు నచ్చిన, తనకు నప్పే పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తోంది. అందుకే ఆమె సినీ పరిశ్రమలో ప్రత్యేక కనటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. సాయిపల్లవి చివరిగా నటించిన చిత్రం గార్గి. ఈ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత సాయిపల్లవి ఏడాది పాటు ఖాళీగానే ఉంది. అయితే సినిమాల్లో గ్యాప్‌ రాలేదని.. తానే తీసుకున్నానని ఆమె పేర్కొంది. తాజాగా తమిళంలో కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తోంది.

చదవండి: ఇంతవరకు అలా చేయలేదంటే ఆశ్చర్యంగా ఉంది: ఉపాసన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement