Actress Samantha Latest Instagram Post Goes Viral With Pablo Neruda Love Quote - Sakshi
Sakshi News home page

Samantha Relationship Rumours: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్‌ అర్థమేంటి?

Published Tue, Jul 4 2023 11:05 AM | Last Updated on Tue, Jul 4 2023 11:39 AM

Samantha Latest Instagram Post Goes Viral - Sakshi

సమంత.. గత దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది.  ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్‌తో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఇలా కేరీర్‌ పరంగా దూసుకెళ్తున్న సమంత.. వ్యక్తిగత జీవితం మాత్రం ఆశాజనకంగా లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో విడాకులు.. ఆ తర్వాత కొన్నాళ్లకే అరుదైన వ్యాధి ‘మయోసైటిస్‌’ బారిన పడడం..ఇలా వరుసగా ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొని నలుగురికి ఆదర్శంగా నిలిచింది.

(చదవండి: గురువు పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్)

మయోసైటీస్‌ బారిన పడిన సమయంలో ఇక సమంత నటించబోదని రూమర్స్‌ వచ్చాయి. కానీ సామ్‌ మాత్రం ఎంతో ధైర్యంతో ఆ వ్యాధి నుంచి బయట పడింది.  కాళ్లు కూడా కదపలేని స్థితిలో నుంచి అదిరిపోయే స్టెప్పులేసే స్టేజ్‌కి వచ్చింది. ఇప్పుడు మునుపటిలా చాలా హుషారుగా షూటింగ్‌లో పాల్గొంటుంది. అయితే మయోసైటీస్‌ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సమంత ఆలోచన విధానమే మారిపోయింది.

జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎప్పుడూ ఉంటాయని.వాటిని తట్టుకుని ఎదగడమే సమర్ధవంతుల లక్ష్యమని ఆమెకు తెలిసొచ్చింది. ఇలాంటి విషయాలనే ఆమె సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులకు చెబుతోంది. మోటివేషనల్‌ కోడ్స్‌ షేర్‌ చేస్తూ తన అభిమానులకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా  నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండే సమంత.. నెట్టింట పెట్టే పోస్ట్‌లు ఒక్కోసారి పలు ఆలోచనలకు దారి తీస్తాయి. తాజాగా సమంత పోస్ట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ప్రేమలో పడిందా?
‘చావు నుంచి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు , కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి’ అని చిలీ దేశానికి చెందిన ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా చెప్పిన మాటలను తాజాగా సమంత తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. సమంత ఎందుకు ఈ కోడ్స్‌ షేర్‌ చేసిందనే చర్చ నెటిజన్స్‌లో మొదలైంది. ఇప్పటికే సమంత ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సామ్‌..  అలాంటి కోడ్స్‌ షేర్‌ చేయడం పలు అనుమానాలకు దారితీస్తుంది. నిజంగానే సమంత ప్రేమలో పడిందా?  మరోసారి సామ్‌ మనసు దోచుకున్న ఆ వ్యక్తి ఎవరు? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement