
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 4న విడుదల చేయనున్నట్లు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం ప్రకటించింది. సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్‌ను ఈ నెల 25న ప్రభాస్‌గారు విడుదల చేయనున్నారు.
ఇందుకు ఆయన అభిమానిగా చాలా ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా’’అన్నారు. ‘‘ఈ సినిమా ఓ ఫన్ రైడ్ ఫిల్మ్. మంచి థ్రిల్ ట్రిప్‌లా ఉంటుంది. ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నాం’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఇది’’ అన్నారు వెంకట్ బోయనపల్లి.
Comments
Please login to add a commentAdd a comment