
ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్(AI).. టెక్నాలజీ పరంగా ఇదో విప్లవం. ఎందుకంటే దీని వల్ల చాలా పనులు చేయడం సులభం అవుతోంది. దీనివల్ల భవిష్యత్‌లో చాలా ఉద్యోగాలు ఊడిపోవచ్చని కూడా అంటున్నారు. ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తుంది. తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా కోసం ఏఐ సాంకేతికతోనే డబ్బింగ్ చెప్పాలని ఫిక్స్ అయ్యారు.
సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్‌తో దీన్ని తీస్తున్నారు. లెక్క ప్రకారం అక్టోబర్ 10నే రిలీజ్ కావాలి. కానీ రజినీకాంత్ మూవీ కోసం వాయిదా వేశారు. నవంబరు 14న దాదాపు 10 భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఫ్రెంచ్, ఇంగ్లీష్, స్పానిష్ భాషలు కూడా ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)
తాజాగా ఎక్స్(ట్విటర్)లో నెటిజన్లతో ముచ్చటించిన 'కంగువ' నిర్మాత కేఈ జ్ఞానవేల్.. సినిమా కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెప్పారు. తమిళం వరకు సూర్య డబ్బింగ్ చెప్పగా.. మిగతా భాషల్లో మాత్రం ఏఐతో డబ్బింగ్ పూర్తి చేస్తామని అన్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇలా ఈ టెక్నాలజీ ఉపయోగించడం ఇదే తొలిసారి. ఒకవేళ ఇది గనక సక్సెస్ అయితే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల పని గండంలో పడ్డట్లే!
'కంగువ' విషయానికొస్తే.. కంగ అనే ఓ యోధుడి జీవితమే స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా సూర్య దాదాపు ఆరు గెటప్స్‌లో కనిపిస్తాడని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ హీరయిన్. బాబీ డియోల్ విలన్. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు చేశారు.
(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి)
Comments
Please login to add a commentAdd a comment