
సాక్షి, చెన్నై: తమిళ హీరో సూర్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశారు. 'నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతానికి చికిత్సతో ఆరోగ్యంగా ఉన్నాను. బయట పరిస్థితులు, మన జీవితం ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదన్న విషయాన్ని మనందరం గ్రహించాలి. అలా అని కరోనా భయంలో మునిగిపోనక్కరలేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. నాకు వైద్యం అందిస్తున్న, అంకిత భావంతో పనిచేస్తున్న వైద్యులకు నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
’கொரோனா’ பாதிப்பு ஏற்பட்டு, சிகிச்சை பெற்று நலமுடன் இருக்கிறேன். வாழ்க்கை இன்னும் இயல்பு நிலைக்கு திரும்பவில்லை என்பதை அனைவரும் உணர்வோம். அச்சத்துடன் முடங்கிவிட முடியாது. அதேநேரம் பாதுகாப்பும், கவனமும் அவசியம். அர்ப்பணிப்புடன் துணைநிற்கும் மருத்துவர்களுக்கு அன்பும், நன்றிகளும்.
— Suriya Sivakumar (@Suriya_offl) February 7, 2021