హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో అగ్ర హీరోలందరితో నటించింది భామ. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల గుర్తుందా శీతాకాలం మూవీతో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తోంది. తమన్నా తెలుగులో చిరంజీవి భోళా శంకర్ మూవీలోనూ నటిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో సందడి చేసింది ముద్దుగుమ్మ. గోవాలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
(ఇది చదవండి: రొమాంటిక్ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు)
న్యూ ఇయర్ పార్టీలో తమన్నా భాటియా, మరో నటుడు విజయ్ వర్మను ముద్దు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ సీన్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో నటులు విజయ్ వర్మ, తమన్నా భాటియా ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. తమన్నా భాటియా కొత్త ఏడాదిలో తమ రిలేషన్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్, తమన్నా తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోలేదు.
కొత్త జంట రిలేషన్‌షిప్‌ను చూసిన కొంతమంది అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. తమన్నాతో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నాడా' ఓ నెటిజన్ ప్రశ్నించారు. మరికొందరేమో విజయ్ 'లక్కీ' పర్సన్ అంటూ కామెంట్ చేశారు. తమన్నా చంద్ సా రోషన్ చెహ్రా (2005)తో సమీర్ అఫ్తాబ్ సరసన నటించింది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిస్తోంది. రాజమౌళి బాహుబలి, ఘని, ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, బాబ్లీ బౌన్సర్, ప్లాన్ ఎ ప్లాన్ బి, గుర్తుందా సీతాకాలం లాంటి చిత్రాల్లో కనిపించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన బోలే చుడియాన్‌లో తమన్నా నటించనుంది.
(ఇది చదవండి: వ్యాపారవేత్తతో పెళ్లి.. తమన్నా క్లారిటీ)
కాగా.. విజయ్, 2012లో చిట్టగాంగ్ చిత్రంతో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. పింక్, మాన్‌సూన్ షూటౌట్, మాంటో, గల్లీ బాయ్, ఘోస్ట్ స్టోరీస్ ఆంథాలజీ చిత్రాలకు కూడా అతను పేరు తెచ్చుకున్నాడు. 2022లో హర్దాంగ్, డార్లింగ్స్ చిత్రాలలో కనిపించాడు. విజయ్ తన తదుపరి చిత్రం కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్‌లతో కలిసి సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్న ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌లో నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment