
‘‘ఇది నా రాముడి కథ.. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు..’ అంటూ హనుమంతుడు పాత్రధారి దేవ దత్తా చెప్పే డైలాగ్‌తో ‘ఆదిపురుష్’ ట్రైలర్ విడుదలైంది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓమ్ రౌత్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్ అండ్ టి. సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘‘నా ప్రాణమే జానకిలో ఉంది.. కానీ నా ప్రాణాలకన్నా మర్యాదే అధిక ప్రియమైనది’, ‘మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్నాపెద్ద అవుతాం’, ‘నాకోసం పోరాడొద్దు.. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి.. ఆ రోజు కోసం పోరాడండి.. పోరాడతారా? అయితే దూకండి ముందుకు.. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి’ అంటూ ప్రభాస్, ‘రాఘవ నన్ను ΄పొందడానికి శివధనస్సును విరిచారు.. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి’ అని కృతీ సనన్ చెప్పే సంభాషణలు ట్రైలర్‌లో ఉన్నాయి.