డ్రగ్స్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తనకు నోటీసులు వచ్చాయనే వార్తలను కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఖండించారు. తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఓ ప్రకటనలో ఇలా తెలిపారు. .ఆదిలింగం అనే వ్యక్తి నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజరుగా పనిచేసిన మాట వాస్తవమే.. సుమారు మూడు ఏళ్ల క్రితం అతను నా వద్ద పనిచేశాడు. తర్వాత అతను ఎక్కడ పనిచేస్తున్నాడో నాకు తెలియదు. ప్రస్తుతం అతడితో ఎలాంటి కమ్యూనికేషన్ కూడా లేదు. మీడియాలో ప్రచారం అవుతున్న వార్త నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నాకు ఎన్‌ఐఏ ఎలాంటి సమన్లు ఇవ్వలేదు. ఈ కేసుకు సంబంధించి అవసరమైతే అధికారులకు తప్పకుండా సహకరిస్తాను.' అని వరలక్ష్మీ తెలిపారు.
2020 మార్చిలో కేసుకు మూలం
మార్చి 2020లో, కేరళలోని విల్లించాం తీర ప్రాంతంలో కేరళ తీర రక్షక దళం ఒక చిన్న పడవను అడ్డగించింది. అనంతరం పోలీసులు సోదాలు చేసి 300 కిలోల డ్రగ్స్, ఏకే 47 రైఫిళ్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 13 మందిని అరెస్టు చేయగా, 14వ వ్యక్తిగా చెన్నైలోని సెలైయూర్ ప్రాంతానికి చెందిన ఆదిలింగంను ఎన్ఐఏ అధికారులు తాజాగ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పుడు నటి వరలక్ష్మి దగ్గర గతంలో సహాయకుడిగా ఆదిలింగం పనిచేసే వాడని విచారణలో తేలింది. ఈ దశలో వరలక్ష్మికి ఈ విషయంలో ఏమైనా సంబంధం ఉందా? అనే సందేహాలు అధికారులకు వచ్చాయి. దీంతో ఆమెను విచారణకు పిలువాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇక భారత ప్రభుత్వం నిషేధించిన ఎల్టీటీఈకి నిధుల సేకరణ కోసమే ఆదిలింగం బ్యాచ్ ఈ పని చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో, ఆగస్టు 2021లో, చెన్నైలోని వలసరవక్‌లో LTTE ఉద్యమానికి సహాయం చేస్తున్న సబేసన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు శ్రీలంక తమిళులను విల్లించం బీచ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారిలో అరెస్టు అయిన డ్రగ్స్ ట్రాఫికింగ్ ముఠా నాయకుడు గుణశేఖరన్‌తో ఆదిలింగం టచ్‌లో ఉన్నాడని తేలింది. దీంతో అతన్ని తాజాగ అరెస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్)
ఆదిలింగం మదురైకి చెందినవాడని, ఆర్మీలో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడని వెల్లడించారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ ముఠా నాయకుడైన గుణశేఖరన్‌కు ఆదిలింగం సర్రోగేట్‌గా వ్యవహరించాడని, డ్రగ్స్, ఆయుధాల రవాణా ద్వారా వచ్చిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలో, ఆది లింగం రాజకీయ పార్టీ, సినిమాల్లో పెట్టుబడిగా పెట్టాడని తేలింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆదిలింగంను మరో వారంరోజుల్లో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించబోతున్నారని, ఆ తర్వాత మరింత సమాచారం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment