లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ‘వాస్తవం’ | Vasthavvam movie Teaser Out | Sakshi
Sakshi News home page

లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ‘వాస్తవం’

Published Tue, Feb 20 2024 4:44 PM | Last Updated on Tue, Feb 20 2024 4:44 PM

Vasthavvam movie Teaser Out - Sakshi

మేఘశ్యాం, రేఖ నిరోష హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘వాస్తవం’. జీవన్‌ బండి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అంజనిసూట్ ఫిలిమ్స్ సంస్థ పై ఆదిత్య ముద్గల్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్య ముద్గల్ మాట్లాడుతూ : ‘ఈ సినిమా ఇష్టంతో చాలా కష్టపడి తీసాం. డైరెక్టర్ జీవన్ చెప్పిన కథ తీసిన విధానం చాలా బాగుంది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు జీవన్ బండి మాట్లాడుతూ.. ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్టులు నాకు చాలా సపోర్ట్. పి. ఆర్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖ నిరోషా చాలా బాగా నటించారు. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది’ అన్నారు.

‘ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అందరికీ నచ్చే కథ అవుతుంది. అతి త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాం’అని హీరోయిన్‌ రేఖ నిరోషా అన్నారు. ‘నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కాలేజ్ నుంచే థియేటర్ ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. తెలుగు ప్రేక్షకుల  సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటున్నాను’ అని హీరో మేఘ శ్యాం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement