ఈ క్రమంలో తమిళనాడులోని థియేటర్‌లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులకు బీస్ట్ సినిమా నచ్చకపోవడంతో స్క్రీన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎంత నచ్చకపోతే మాత్రం మరీ థియేటర్‌కు నిప్పంటిస్తారా? అని మండిపడుతున్నారు కొందరు నెటిజన్లు.
పెద్ద హీరో సినిమా రిలీజవుతుంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. సినిమా అదిరిందంటే పాలాభిషేకాలు, బాగోలేదంటే పోస్టర్లు చించడాలు, విమర్శలు సర్వసాధారణమే. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం హద్దు మీరి ప్రవర్తించారు. నోటికి కాకుండా ఏకంగా చేతికి పని చెప్పారు. బీస్ట్ నచ్చకపోవడంతో థియేటర్‌కే నిప్పంటించారు.
తమిళ స్టార్ విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం (ఏప్రిల్ 13న) రిలీజైంది. అయితే సినిమాకు పొద్దుటినుంచే నెగెటివ్ టాక్ స్టార్ట్ అయింది. సినిమా రంజుగా లేదంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్తే చివరికి నిరాశతో వెనుదిరిగి రావాల్సి వస్తోందంటూ దిగులుగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో తమిళనాడులోని థియేటర్‌లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులకు బీస్ట్ సినిమా నచ్చకపోవడంతో స్క్రీన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎంత నచ్చకపోతే మాత్రం మరీ థియేటర్‌కు నిప్పంటిస్తారా? అని మండిపడుతున్నారు కొందరు నెటిజన్లు.
Frustrated Vijay fans firing Theatres Screens #BeastDisaster
— 🔥 Ajith Kumar🔥 (@Anythingf4AJITH) April 13, 2022
pic.twitter.com/P5X9tbhQLx
చదవండి: విజయ్ ‘బీస్ట్’ మూవీ టాక్ ఎలా ఉందంటే..
విజయ్ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, నేనెంత?: హీరో