
గత నెలలో తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది యాంకర్ విష్ణుప్రియ. అప్పటినుంచి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె తల్లి పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ మరోసారి భావోద్వేగానికిలోనైంది. ఫిబ్రవరి 15న తల్లి బర్త్‌డే కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. 'నీ ప్రేమ, ఎనర్జీని ఎవ్వరూ భర్తీ చేయలేరు. నా డార్లింగ్ ఏంజెల్‌ను ఇప్పటికీ, ఎప్పటికీ మిస్ అవుతాను. లవ్ యూ అమ్మ' అని తనపై ఉన్న ప్రేమను అక్షరాల రూపంలో వ్యక్తీకరించింది.
ఇక వీడియోలో అమ్మతో గడిపిన సరదా క్షణాలను, జ్ఞాపకాలను పంచుకుంది. అలాగే తల్లి ఫోటోకు నమస్కరించిన ఫోటోను చూపించింది. వీడియో చివర్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను జత చేసింది. 'నా జీవితంలో ఒక్క మహారాణి మా అమ్మ మాత్రమే' అని చెప్పుకొచ్చింది. కాగా జనవరి 26న విష్ణుప్రియ తల్లి తుదిశ్వాస విడిచింది. మరోవైపు విష్ణుప్రియ స్నేహితురాలు, నటి రీతూ చౌదరి సైతం ఇటీవలే తన తండ్రిని కోల్పోగా ఇప్పటికీ ఆ బాధలో నుంచి తేరుకోలేకపోతోంది.
చదవండి: రెండుసార్లు బ్రేకప్.. అది నాకు బ్లాక్ డే అంటున్న బ్యూటీ
Comments
Please login to add a commentAdd a comment