కమల్, రాజమౌళి
ఐదేళ్ల ప్రాయం నుంచే కళామ్మతల్లి ఒడిలో పెరిగిన నటుడు కమలహాసన్. సినిమాకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ ఆయన నిష్టాతుడు అని.. చెప్పవచ్చు. తమిళం, తెలుగు మలయాళం, హిందీ.. ఇలా పలు భాషల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కమల్‌హాసన్‌ను సినిమా ఎన్‌సైక్లోపీడియా అంటారు.
తాజాగా ఆయన హీరోగా నటించి సొంత బ్యానర్‌పై నిర్మించిన విక్రమ్ చిత్రంతో చాలా రికార్డులను బద్దలు కొట్టాడు. అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. మరోపక్క బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోకు హోస్ట్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ – 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తదుపరి మలయాళ దర్శకుడుతో ఓ చిత్రం, విక్రమ్‌కు పార్ట్ – 2 చిత్రాలు చేయాల్సి ఉంది. అదేవిధంగా నిర్మాతగానూ శివ కార్తికేయన్ హీరోగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇక దర్శక ధీరుడు అనగానే గుర్తుకొచ్చేది రాజమౌళినే. ఆయన షూటింగ్ ప్రారంభించారంటే.. అది బ్లాక్ బస్టరే. తెలుగు సినిమాను ఎల్లలు దాటించిన దర్శకుడు ఆయన.
చదవండి: (నామినేషన్‌కి ఆస్కారం!)
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో ప్రపంచ గుర్తింపు పొందారు. ఈనేపథ్యంలో దిగ్గజాలు కమలహాసన్, రాజమౌళి కలిసి చిత్రం చేస్తే అది ఎలా ఉంటుందో ఊహకే అందదంటే అతిశయోక్తి కాదు. ఆ కాంబోలో చిత్రం రూపొందడానికి బీజం పడిందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజానికి రాజమౌళికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమలహాసన్ వంటి నటులతో చిత్రాలు చేయాలన్న కోరిక చాలాకాలంగానే ఉందనేది ఆయనే పలు వేదికలపై వ్యక్తం చేశారు. కాగా ఇటీవల కమలహాసన్ రాజమౌళి భేటీ అయినట్లు, చాలా విషయాల గురించి వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
అదే సమయంలో వారిద్దరూ కలిసి చిత్రం చేసే విషయం గురించి కూడా చర్చించినట్లు టాక్. దీంతో కమలహాసన్ రాజమౌళిల కాంబోలో చిత్రం ఆశించవచ్చనే విషయం వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం పూర్తి కావడానికి కనీసం రెండు మూడు ఏళ్లు పడుతుంది. ఇది పూర్తి అయిన తర్వాత రాజమౌళి చిత్రంలోని నటించడానికి సిద్ధమవుతారు. కాబట్టి కమలహాసన్ రాజమౌళి కాంబోలో చిత్రం అన్ని వార్త నిజమే అయితే అది వాస్తవ రూపం దాల్చడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment